NTV Telugu Site icon

BSNL: బిఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా.. అపరిమిత కాల్స్ ఏడాది పాటు వ్యాలిడిటీ!

Bsnl

Bsnl

BSNL: భారతదేశ ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) ఫిక్స్‌డ్ లైన్, బ్రాడ్‌ బ్యాండ్, మొబైల్ నెట్వర్క్ అనేక ఇతర సేవలను అందిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రవేట్ నెట్వర్క్స్ కు ధీటుగా వినియోగదారులకు సరసమైన ధరలలో సేవలను అందించడానికి ప్రయత్నిస్తుంది. 2025 మార్చి 14న హోలీ పండుగ రానున్న నేపథ్యంలో, BSNL ప్రజల కోసం “హోలీ ధమాకా” ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాల్స్ ఏడాది పొడవునా వ్యాలిడిటీని అందిస్తోంది. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో వినియోగదారులకు అదనపు ప్రయోజనాలు, డేటా, కాలింగ్ ఆఫర్లు BSNL విడుదల చేస్తుంటుంది.

Read Also: Hyderabad: అతడికి 22 ఆమెకు 35.. ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి..

బిఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా ఆఫర్ గా రూ. 2,399 ప్లాన్‌కు వర్తిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీని ఇప్పుడు మరిన్ని రోజులకు పొడిగించారు. బిఎస్ఎన్ఎల్ 2,399 ప్లాన్ అపరిమిత కాలింగ్, రోజుకు 2GB డేటా, 100 SMSలను అందిస్తుంది. అయితే, టెలికాం సంస్థ ఈ ప్లాన్ వ్యాలిడిటీని 395 రోజుల నుండి 425 రోజులకు పెంచింది. సాధారణంగా 395 రోజులకు మాత్రమే ఉన్న ప్లాన్, ఇప్పుడు ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా 30 రోజుల వ్యాలిడిటీని పొడిగించడంతో 425 రోజులకు పొడిగించబడింది.

Read Also: Pendem Dorababu: డిప్యూటీ సీఎం పవన్‌తో వైసీపీ మాజీ ఎమ్మెల్యే భేటీ.. జనసేనలో చేరికకు ముహూర్తం ఫిక్స్‌

BSNL తాజా రీచార్జ్ ప్లాన్లు:

రూ.199 ప్లాన్: 30 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.

రూ.499 ప్లాన్: 60 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5GB డేటా, రోజుకు 100 SMSలు, అన్‌లిమిటెడ్ కాల్స్.

రూ.999 ప్లాన్: 90 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, OTT సబ్‌స్క్రిప్షన్, అన్‌లిమిటెడ్ కాల్స్.

రూ.1999 ప్లాన్: 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2.5GB డేటా, ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, అన్‌లిమిటెడ్ కాల్స్.

BSNL వినియోగదారులు ఈ హోలీ ధమాకా ఆఫర్‌ను ఉపయోగించుకొని ఎక్కువ కాలం పాటు తక్కువ ధరకే మంచి సేవలను పొందవచ్చు. దేశవ్యాప్తంగా BSNL నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ సూచిస్తోంది.