అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL AirFibre: దేశంలో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను మరింత పెంచేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) అందిస్తున్న ఎయిర్ ఫైబర్ (AirFibre) సేవలు వినియోగదారులకు భారీ ఆఫర్స్ ను తీసుక వచ్చింది. ఫైబర్ కేబుల్స్ వేయడం కష్టమైన ప్రాంతాల్లో కూడా వేగవంతమైన ఇంటర్నెట్ను అందించేందుకు ఈ సేవను తీసుకొచ్చింది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ సేవ 5G కాకుండా BSNL ఇప్పటికే ఉన్న 4G నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది.
హైస్పీడ్ ఇంటర్నెట్:
బిఎస్ఎన్ఎల్ AirFibre 200Mbps ప్లాన్‌లో గరిష్టంగా 200Mbps డౌన్లోడ్ స్పీడ్ లభిస్తుంది. దీంతో ఆన్లైన్ గేమింగ్, 4K వీడియో స్ట్రీమింగ్, వీడియో కాల్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, భారీ ఫైళ్ల డౌన్లోడ్ వంటి పనులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయవచ్చు. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతి నెల 5TB హైస్పీడ్ డేటా అందుతుంది. 5TB డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 10Mbpsకు తగ్గుతుంది. ఇలా మరుసటి బిల్లింగ్ సైకిల్ ప్రారంభమైన తర్వాత మళ్లీ పూర్తి స్పీడ్ అందుబాటులోకి వస్తుంది. మార్కెట్లోని అనేక బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ లలో సాధారణంగా 3.3TB వరకు మాత్రమే డేటా లభిస్తుండగా.. BSNL ఈ ప్లాన్‌లో 5TB డేటా ఇవ్వడం ప్రత్యేకతగా నిలుస్తోంది.
Also Read
- Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..
- Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
- Donald Trump: నన్ను చంపడానికి ట్రై చేస్తే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ్.. ట్రంప్ షాకింగ్ ప్రకటన..
ఉచిత OTT సబ్స్క్రిప్షన్లు:
ఈ ప్లాన్‌తో పాటు పలు ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్స్క్రిప్షన్లను కూడా బిఎస్ఎన్ఎల్ ఉచితంగా అందిస్తోంది. ఇందులో జియో హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, లయన్స్‌గేట్ ప్లే, హంగామా, షెమరూమీ, ఎపిక్ఆన్ తోపాటు మరికొన్ని OTT సేవలు కూడా ఉన్నాయి. దీంతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు అదనపు ఖర్చు లేకుండానే వీక్షించవచ్చు.
అన్లిమిటెడ్ ల్యాండ్‌లైన్ కాలింగ్:
ఇంటర్నెట్తో పాటు అన్లిమిటెడ్ ల్యాండ్‌లైన్ కాలింగ్ సదుపాయం కూడా ఈ ప్లాన్‌లో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా పరిమితులు లేకుండా కాల్స్ చేసుకోవచ్చు. అయితే ల్యాండ్‌లైన్ ఫోన్ పరికరాన్ని వినియోగదారులే ప్రత్యేకంగా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ అందుబాటులో లేని ప్రాంతాల్లో నివసించే వారికి BSNL AirFibre మంచి ప్రత్యామ్నాయం. కేబుల్స్ అవసరం లేకుండానే వేగవంతమైన ఇంటర్నెట్, భారీ డేటా, ఉచిత OTTలు, అన్లిమిటెడ్ కాలింగ్ వంటి ప్రయోజనాలు ఒకే ప్లాన్‌లో లభించడం దీని ప్రత్యేకత.
తాజావార్తలు
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Akkineni Nagarjuna : అఖిల్‌కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
-
Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..
-
INS Mahendragiri: భారత నౌకాదళంలోకి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఆత్మనిర్భర్ భారత్‌కు మరో మైలురాయి
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!