BSNL 24th Anniversary Offer: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ప్లాన్‌లను తీసుకొస్తోంది. ఈ క్రమంలో మరో ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈనెలలో బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీని స్థాపించి 24 సంవత్సరాలు పూర్తయి.. 25వ ఏడాదిలో అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా తన కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా 24 జీబీ డేటాను ఇవ్వనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్‌లో తెలిపింది.
బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న ఈ ఆఫర్ పొందాలంటే రూ.500 కంటే ఎక్కువ వోచర్‌తో రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. 500 కంటే ఎక్కువ ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి ఉచితంగా 24జీబీ డేటా లభిస్తుంది. ఈ ఆఫర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 24లోపు రీఛార్జి చేసుకున్నవాళ్లు మాత్రమే ఈ ప్రయోజనాలు పొందుతారు. 2000 సెప్టెంబర్ 15న బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీని స్థాపించారు.
Also Read: Apple Diwali Sale 2024: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 10వేల డిస్కౌంట్, ఫ్రీ ఇయర్ బడ్స్!
ప్రైవేట్ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు తమ రీఛార్జ్ ప్లాన్‌లను భారీగా పెంచిన విషయం తెలిసిందే. అన్ని రీఛార్జ్ ప్లాన్‌లపై 20 నుంచి 30 శాతం పెంచాయి. దాంతో చాలా మంది యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు షిఫ్ట్ అయ్యారు. దీన్ని అవకాశంగా చేసుకొని.. బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవలి కాలంలో సరికొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది.