Site icon NTV Telugu

AOB Maoist: ఏవోబీలో మావోయిస్టులు భారీ షాక్‌

Aob

Aob

AOB Maoist: ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది.. మావోయిస్టుల‌కు చెందిన భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. ఏవోబీలో బెజ్జింగివాడ అట‌వీప్రాంత‌లో నిర్దిష్టమైన స‌మాచారంతో గాలింపు చేస్తున బ‌ల‌గాలు.. షాక్ దూల‌గండి గ్రామ స‌మీపంలో ప‌ర్వతంలో రాతికి రంద్రాల్లో ఉన్న మావోయిస్టుల డంప్ ను గుర్తించారు.. సీలేరు న‌దికి స‌మీపంలో మ‌ల్కన్‌గిరి జిల్లా కుర్మనూర పంచాయ‌తీ దూల‌గండి అట‌వీప్రాంతంలో ఈ డంప్ గుర్తించారు. ఈ డంప్‌లో ఎస్‌బీఎంల్ తుపాకీలు మూడు, ఎల‌క్ట్రిక్ డిటోనేట‌ర్స్ మూడు, జిలెటెన్ స్టిక్స్‌-98, డైర‌క్షన‌ల్ మైన్స్‌-2, సోలార్ ప్లేట్‌, గ్యాస్ సిలెండ‌ర్లతో పాటు మందులు, త‌దిత‌ర సామాగ్రీ లభించాయి.. మావోయిస్టుల కంచుకోట‌గా పేరున్న బెజ్జంగివాడ అట‌వీప్రాంత‌లో బీఎస్ఎఫ్ పోలీసులు డంప్ స్వాధీనం చేసుకోవ‌డంతో ఈ ప్రాంతంలో మావోయిస్టులు కార్యక‌లాపాల‌కు చెక్ పెట్టే ప్రయత్నాల్లో బీఎస్‌ఎఫ్ ముందడుగు వేసినట్టు అయ్యింది.

Read Also: Ponnam Prabhakar: అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు.. పొన్నం ప్రభాకర్‌ సమీక్ష..

Exit mobile version