NTV Telugu Site icon

Border Security Force: భారత్‌లోకి చొరబడుతున్న పాకిస్థాన్ ఉగ్రవాదులు.. అరికట్టేదెలా?

Bsf

Bsf

పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లు అధికమయ్యాయి. చొరబాట్లను మెరుగ్గా నిరోధించడానికి సరిహద్దు భద్రతా దళం (BSF) చర్యలు ప్రారంభించింది. ఇటీవల పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి జమ్మూ ప్రాంతంలో 2,000 మంది సిబ్బందితో కూడిన రెండు కొత్త బెటాలియన్లను మోహరించింది. ఈ బెటాలియన్‌ల సైనికులు పాకిస్థాన్‌తో అంతర్జాతీయ సరిహద్దులో బీఎస్ఎఫ్ విస్తరణ పాయింట్ వెనుక ‘సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్’గా మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు బెటాలియన్లు ఇటీవల ఒడిశాలోని యాంటీ నక్సల్ ఆపరేషన్ ప్రాంతం నుంచి వచ్చాయి.

READ MORE: Pushpa 2: పుష్ప 2పై షాకింగ్ ట్వీట్ పెట్టి డిలీట్ చేసిన టీడీపీ ఎంపీ

శీతాకాలంలో పాకిస్థాన్ నుంచి చొరబాట్లు పెరుగుతాయి. ఎందుకంటే.. బార్డర్‌లో మంచు ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ పొగ మంచులో మనుషులు సరిగ్గా కనిపించకపోవడంతో ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నిస్తారు. ఈ చొరబాట్లకు వ్యతిరేకంగా.. ఈ శీతాకాలం ప్రారంభానికి ముందే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొత్త యూనిట్ల సిబ్బందిని సాంబా ప్రాంతం, జమ్మూ ప్రాంతంలోని మరికొన్ని సున్నితమైన ప్రాంతాలు, పంజాబ్ సరిహద్దులో మోహరించినట్లు వర్గాలు తెలిపాయి. సీసీ కెమెరాలతో కూడిన పలు డిప్లాయ్‌మెంట్‌ పాయింట్లను రూపొందించామని వెల్లడించాయి. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ చుట్టూ భారతదేశంలోని పశ్చిమ భాగంలో 2,289 కి.మీ కంటే ఎక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దును బీఎస్ఎఫ్ కాపాడుతుంది. దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలతో చుట్టుముట్టబడిన జమ్మూ ప్రాంతంలో ఈ సరిహద్దు 485 కి.మీ. జమ్మూ ఇంటర్నేషనల్ బోర్డర్ ఏరియాలో దాదాపు డజను బీఎస్ఎఫ్ బెటాలియన్లు మోహరించబడ్డాయి.