NTV Telugu Site icon

BSA Gold Star 650: భారత మార్కెట్లోకి బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650.. ధర ఎంతంటే..?

Bsa Gold Star

Bsa Gold Star

ప్రసిద్ధ బ్రిటిష్ బైక్ తయారీదారు బీఎస్ఏ (BSA) బైక్స్.. తన ప్రొడక్ట్ను 2021లో ప్రపంచవ్యాప్తంగా రీ మోడలింగ్ చేసింది. ఇప్పుడు ఈ బ్రాండ్ భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత మార్కెట్లోకి తిరిగి వచ్చింది. బీఎస్ఏ బైక్స్ తన మొదటి ఆఫర్ గోల్డ్ స్టార్ 650ని విడుదల చేసింది. హైలాండ్ గ్రీన్, ఇన్‌సిగ్నియా రెడ్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ధర రూ. 3 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). మిడ్‌నైట్ బ్లాక్, డాన్ సిల్వర్ కలర్ ఆప్షన్‌ల ధర రూ. 3.12 లక్షలు. షాడో బ్లాక్ కలర్ ఆప్షన్ ధర రూ. 3.16 లక్షలు.. టాప్-ఆఫ్-ది-లైన్ లెగసీ ఎడిషన్ – షీన్ సిల్వర్ ధర రూ. 3.35 లక్షలుగా ఉంది.

USA: ల్యాండింగ్ సమయంలో షాకిచ్చిన పైలట్.. హడలెత్తిపోయిన ప్రయాణికులు

బుకింగ్ వివరాలు
బీఎస్ఏ బైక్స్ గోల్డ్ స్టార్ 650 కోసం బుకింగ్‌ను ఆగస్ట్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 2021 నుండి BSA గోల్డ్ స్టార్ 650 యూకే, యూరప్‌లో విక్రయిస్తున్నారు. ఇది భారతీయ తయారీదారు.. క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహీంద్రా గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ. ఇది జావా.. యెజ్డీ బైక్లను కూడా తయారు చేస్తుంది.

రెట్రో డిజైన్
ఈ బైక్ గోల్డ్ స్టార్ డిజైన్ ని కలిగి ఉంది. ఇలాంటి డిజైన్ కలిగి ఉన్న బైక్ ను 1938-1963 మధ్య కాలంలోనే విక్రయించారు. మాడ్రన్ క్లాసిక్ డిజైన్‌లో గుండ్రని హెడ్‌ల్యాంప్, కర్వ్డ్ ఫెండర్‌లు.. మంచి ఆకారంలో ఆయిల్ ట్యాంక్ ఉన్నాయి. అంతేకాకుండా.. బైక్ క్రోమ్‌తో పాటు సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్, సింగిల్-పీస్ సీటు.. వైర్-స్పోక్ వీల్స్‌ కలిగి ఉంటుంది. ఇవన్నీ బైక్ రెట్రో ఆకర్షణను మరింత పెంచుతాయి. బైక్‌లో డిజిటల్ రీడౌట్, USB ఛార్జింగ్‌తో కూడిన రెట్రో-శైలి ట్విన్-పాడ్ మీటర్ ఉంది.

ఇంజిన్ పవర్
బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650, 652 cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో శక్తిని పొందింది. ఈ బైక్ లో అతిపెద్ద డిస్ప్లేస్‌మెంట్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌లలో ఒకటి. ఈ ఇంజన్ 6,500 rpm వద్ద 45 bhp శక్తిని.. 4,000 rpm వద్ద 55 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌లు ఉంటాయి.

బ్రేకింగ్ మరియు సస్పెన్షన్
ఈ ఆధునిక క్లాసిక్ బైక్ క్రెడిల్ ఫ్రేమ్‌ను ఉపయోగిస్తుంది. ఇందులో సస్పెన్షన్ డ్యూటీ కోసం ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు.. వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బ్రేకింగ్ కోసం ముందు.. వెనుక రెండింటిలోనూ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇది డ్యూయల్-ఛానల్ ABSతో 320 mm ముందు, 255 mm వెనుక డిస్క్ బ్రేక్ సెటప్‌ను కలిగి ఉంది.

భారతీయ మార్కెట్లో బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650తో పోటీపడుతుంది. కాగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ప్రారంభ ధర రూ. 3.03 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Show comments