Site icon NTV Telugu

Tamilnadu : మద్యం ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించినందుకు ఇద్దరు యువకుల దారుణ హత్య

Murder

Murder

Tamilnadu : తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తమ కాలనీలో మద్యం ఎందుకు అమ్ముతున్నారు అని ప్రశ్నించడంతో ఇద్దరు యువకులను దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం మైలాడుతురై జిల్లా ముట్టం గ్రామంలో చోటుచేసుకుంది… గ్రామానికి చెందిన హరీష్, హరిశక్తి ఇంజనీరింగ్ విద్యార్థులు. తమ కాలనీలో ఎందుకు మద్యం అమ్ముతున్నారని.. రాత్రి పగలు తేడా లేకుండా అమ్మడం ఏంటని మద్యం వ్యాపారులతో గొడవకు దిగారు.. విద్యార్థుల గొడవతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇద్దరు మద్యం వ్యాపారాలను అరెస్టు చేశారు. అయితే తమతో గొడవపడి వ్యాపారానికి అడ్డొచ్చిన యువకులపై కక్ష పెంచుకున్న మద్యం వ్యాపారులు… తెల్లవారుజామున ఇంటి బయట ఉన్న ఇద్దరు యువకులను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు. హత్య చేసిన మద్యం ముగ్గురు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also:Aishwarya Rajesh: ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుంది: ఐశ్వర్యా రాజేష్

పుదుచ్చేరిలో ముగ్గురి దారుణ హత్య
పుదుచ్చేరిలోని రెయిన్‌బో నగర్‌లోని 7వ క్రాస్ స్ట్రీట్‌లోని ఒక శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ముగ్గురు యువకులు హత్యకు గురైనట్లు పెరియకడై పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు యువకుల మృతదేహాలను గుర్తించారు. మరొకరు రక్తస్రావం కారణంగా ప్రాణాలతో పోరాడుతున్నారు. వెంటనే అతన్ని రక్షించి అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స ఫలించక ఆ యువకుడు కూడా మరణించాడు. తరువాత, పోలీసులు మిగిలిన ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read Also:CM Chandrababu: నేడు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..

ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించగా, చాలా సంవత్సరాల క్రితం హత్యకు గురైన రెడ్డియార్‌పాళయంకు చెందిన థెస్తాన్ అనే ప్రముఖ రౌడీ కుమారుడు రిషి, తిదిర్ నగర్‌కు చెందిన దేవా, జె.జె. నగర్‌కు చెందిన ఆతి హత్యలకు పాల్పడ్డారని తేలింది. మునుపటి శత్రుత్వం కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని వెల్లడైంది. హత్య కేసులో అనుమానంతో టీవీ నగర్ కు చెందిన ప్రముఖ రౌడీ సత్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒకేసారి ముగ్గురు వ్యక్తులను నరికి చంపిన సంఘటన ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

Exit mobile version