Telugu Student: అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Student: అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.. గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం పనిచేస్తున్న వీర సాయిష్‌ని నిన్న రాత్రి కాల్చి చంపారు దుండగులు.. ఆ విద్యార్థి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు… ఉన్నత చదువుల కోసం (ఎమ్మెస్) అమెరికా వెళ్లిన సాయిష్ ప్రాణాలు ఇలా పోవడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఇండియాకు చెందిన ఇద్దరు తెలుగు యువకుల మృతిలో పాలకొల్లుకు చెందిన సాయిష్ ఒకరు.. మరో నెలరోజుల్లో చదువు పూర్తి చేసుకునే సమయంలో వీర సాయిష్ ఇలా ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- TVK: నీట్‌ను పూర్తిగా రద్దు చేయాలి.. టీవీకే పార్టీ సంచలన డిమాండ్
- Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్‌స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
- Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
- National Flag Day: నేడు జాతీయ జెండా దినోత్సవం.. తిరంగా గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు?
ఇక, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు అమెరికాలో మృతిచెందిన సాయిష్ తల్లి వీరా జయశ్రీ.. తండ్రి ఆఖరి కోరిక తీర్చడానికి వీరా సాయిష్ అమెరికా వెళ్ళాడు.. కొద్ది రోజుల్లో తిరిగి వస్తాడనుకున్న సాయిని దారుణంగా హత్యచేశారని కన్నీరుమున్నీరయ్యారు. తన సొంత ఖర్చులతో చదువు కొనసాగిస్తున్నాడు.. చదువుల్లో, ఆటల్లో యాక్టీవ్‌గా ఉండే వాడు.. అమెరికాలో సైతం అనేక ఆటల్లో ముందుండేవాడు.. కానీ, ఎదిగిన కొడుకు ఇలా అవుతాడు అనుకోలేదంటూ విలపించారు.. చదువుకునేందుకు వెళ్ళిన నా మేనల్లుడిని హత్యచేశారు.. డబ్బులేకుంటే వచ్చేయమని చాలా సార్లు చెప్పాను.. ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి ఆదేశానికి బలిచ్చారు.. ఇలా ఎంతమంది తల్లిదండ్రులకు శోఖం మిగులుస్తారో అంటూ సాయి మేనత్త ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన వీరా సాయిష్ వయస్సు 23 ఏళ్లు.. గ్యాస్ స్టేషన్ లో డబ్బు దోచుకుని సాయిష్ ను హత్య చేశారు దుండగుడు.. పాలకొల్లుకు చెందిన సాయిష్ కుటుంబం కొద్ది కాలం క్రితం ఏలూరులో స్థిరపడ్డారు. కొద్దికాలం క్రితం అనారోగ్య కారణాలతో సాయిష్ తండ్రి కూడా మృతిచెందాడు.. ఏలూరుకు చెందిన వీర సాయిష్ పై అమెరికాలోని వెస్ట్ కొలంబస్ లో దుండగుడు కాల్పులు జరిపాడు.. అర్ధరాత్రి 12.50 గంటలకు దోపిడీని అడ్డుకునే ప్రయత్నంలో సాయిష్ ప్రాణాలు కోల్పోయాడు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. అనుమానితుడి ఫోటోలు విడుదల చేశారు కొలంబస్ పోలీసులు..
తాజావార్తలు
-
AA 23 : బన్నీ- లోకి సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే ఫిక్స్.. లుక్ టెస్ట్ ఫినిష్
-
TVK: నీట్‌ను పూర్తిగా రద్దు చేయాలి.. టీవీకే పార్టీ సంచలన డిమాండ్
-
Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్‌స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
-
Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
-
China Thanks India: చైనా నావికుల ప్రాణాలను కాపాడిన ఉపకారాన్ని ఎప్పటికీ మరచిపోలేం.. భారత సైన్యానికి చైనా కృతజ్ఞతలు
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!