NTV Telugu Site icon

Telugu Student: అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య..

Telugu Student

Telugu Student

Telugu Student: అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.. గ్యాస్ స్టేషన్‌లో పార్ట్ టైం పనిచేస్తున్న వీర సాయిష్‌ని నిన్న రాత్రి కాల్చి చంపారు దుండగులు.. ఆ విద్యార్థి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు… ఉన్నత చదువుల కోసం (ఎమ్మెస్) అమెరికా వెళ్లిన సాయిష్‌ ప్రాణాలు ఇలా పోవడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఇండియాకు చెందిన ఇద్దరు తెలుగు యువకుల మృతిలో పాలకొల్లుకు చెందిన సాయిష్ ఒకరు.. మరో నెలరోజుల్లో చదువు పూర్తి చేసుకునే సమయంలో వీర సాయిష్ ఇలా ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు..

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

ఇక, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు అమెరికాలో మృతిచెందిన సాయిష్ తల్లి వీరా జయశ్రీ.. తండ్రి ఆఖరి కోరిక తీర్చడానికి వీరా సాయిష్‌ అమెరికా వెళ్ళాడు.. కొద్ది రోజుల్లో తిరిగి వస్తాడనుకున్న సాయిని దారుణంగా హత్యచేశారని కన్నీరుమున్నీరయ్యారు. తన సొంత ఖర్చులతో చదువు కొనసాగిస్తున్నాడు.. చదువుల్లో, ఆటల్లో యాక్టీవ్‌గా ఉండే వాడు.. అమెరికాలో సైతం అనేక ఆటల్లో ముందుండేవాడు.. కానీ, ఎదిగిన కొడుకు ఇలా అవుతాడు అనుకోలేదంటూ విలపించారు.. చదువుకునేందుకు వెళ్ళిన నా మేనల్లుడిని హత్యచేశారు.. డబ్బులేకుంటే వచ్చేయమని చాలా సార్లు చెప్పాను.. ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి ఆదేశానికి బలిచ్చారు.. ఇలా ఎంతమంది తల్లిదండ్రులకు శోఖం మిగులుస్తారో అంటూ సాయి మేనత్త ఆవేదన వ్యక్తం చేశారు.

అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన వీరా సాయిష్ వయస్సు 23 ఏళ్లు.. గ్యాస్ స్టేషన్ లో డబ్బు దోచుకుని సాయిష్ ను హత్య చేశారు దుండగుడు.. పాలకొల్లుకు చెందిన సాయిష్ కుటుంబం కొద్ది కాలం క్రితం ఏలూరులో స్థిరపడ్డారు. కొద్దికాలం క్రితం అనారోగ్య కారణాలతో సాయిష్ తండ్రి కూడా మృతిచెందాడు.. ఏలూరుకు చెందిన వీర సాయిష్‌ పై అమెరికాలోని వెస్ట్ కొలంబస్ లో దుండగుడు కాల్పులు జరిపాడు.. అర్ధరాత్రి 12.50 గంటలకు దోపిడీని అడ్డుకునే ప్రయత్నంలో సాయిష్ ప్రాణాలు కోల్పోయాడు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. అనుమానితుడి ఫోటోలు విడుదల చేశారు కొలంబస్ పోలీసులు..

Show comments