NTV Telugu Site icon

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు.. సీఎం కేసీఆర్ నిర్ణయం

Cabinet Metting Kcr

Cabinet Metting Kcr

MLC Elections: తెలంగాణలో మరోసారి ఎన్నికలకు నగారా మోగింది. ఇటీవలు కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నికల జరగనుంది. వీటిలో ఒకటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కాగా.. మరొకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక. హైదరాబాద్-రంగారెడ్డికి సంబంధించి స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
Read Also: KTR: రూ.400కోట్లతో గ్లాండ్ ఫార్మా విస్తరణ.. వెల్లడించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని గతంలో ఎంఐఎంకు బీఆర్ఎస్ కేటాయించగా.. ఈ సారి కూడా ఎంఐఎంకే మద్దతు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఎంఐఎం ఉంది. దీంతో ఆ పార్టీకే హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గత తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు తెలుపుతూ వస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా మజ్లిస్ మద్దతుతోనే బీఆర్ఎస్ గట్టెక్కింది.
Read Also: Maoist Warning: కాంగ్రెస్ పార్టీకి మావోయిస్టుల వార్నింగ్..
ఈ క్రమంలో ఎమ్మెల్సీ సీటును ఎంఐఎంకే కేసీఆర్ అప్పగించారని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం వెనుక అసలు కారణం ఇదేనని అంటున్నారు. ముస్లిం ఓట్లు చీలిపోతే బీఆర్ఎస్ కు కూడా నష్టం కలిగే అవకాశముంది.