NTV Telugu Site icon

Soma Bharat: కాంగ్రెస్ ఏకే గోయల్‌కు క్షమాపణ చెప్పాలి.. లేదంటే పరువు నష్టం దావా వేస్తాం

Soma Bharath

Soma Bharath

మాజీ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ సలహాదారు ఏకే గోయల్ ఇంట్లో ఇటీవల ఎన్నికల అధికారులు తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో నుంచి అక్రమంగా డబ్బు తరలిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఎలక్షన్ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు నిర్వహించింది. దీనిపై ముందుస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సోదాలు చేయడాన్ని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ఖండించారు. మంగళవారం ఏకే గోయల్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు.

Also Read: Kishan Reddy: తెలంగాణ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

Ak గోయల్ ఇంట్లో డబ్బులు దాచారని కాంగ్రెస్ ఆరోపణలు చేసిందని, అందుకే ఎలక్షన్ టాస్క్ ఫోర్స్ ఆయన ఇంటిపై దాడి చేసిందన్నారు. ఇవి నిరాధారమైన ఆరోపణలని, ఎలక్షన్ టాస్క్ ఫోర్స్ వెతికిన ఆయన ఏం దొరకలేదన్నారు. ఇది కాంగ్రెస్ చేసిన దుర్మార్గమైన చర్య అని, Ak గోయల్ పరువును బజారుకీడ్చారని పేర్కొన్నారు. సోదాలు చేసే సమయంలో ఆయన ఇంటి ముందు విజయరెడ్డి, మల్లు రవి, అజహరుద్దీన్‌లు చేసింది నీజమైన చర్య ఆయన ధ్వజమెత్తారు. సమాజం లో గౌరవంగా బతుకుతున్న గోయల్ ఇంటిపై దాడి చేయడం కాంగ్రెస్ సంస్కృతిని ప్రతిబింబింస్తుందన్నారు. సీనియర్ సిటిజన్ ఇంటి వద్ద మూడు వందల మంది దాడి చేయడం కరెక్టా? అని ప్రశ్నించారు.

Also Read: Mansoor Ali Khan: నాది వక్రబుద్ది అయితే.. చిరంజీవిది ఏంటి మరి.. ?

కాంగ్రెస్ కంప్లైంట్ చేసిన చేసిన గంటలోపే పోలీసులు సోదా చేశారని, Ak గోయల్ ఇంటి వద్ద సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. మేము అక్కడి నుంచి డబ్బులు తరలిస్తే అందులో అందరూ చూడవచ్చన్నారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీలు ఉన్నపుడు ఇలాంటి సంస్కృతిని చూడలేదని, ఒక సీనియర్ సిటిజెన్ పట్ల కాంగ్రెస్ ఇలా వ్యవహారించవచ్చా? అని మండిపడ్డారు. అనుమతి లేకుండా ధర్నా చేసినందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ AK గోయల్‌కు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తామని సోమ భరత్ హెచ్చరించారు.