Site icon NTV Telugu

BRS Party: తొమ్మిదేళ్ల పాలనపై బీఆర్ఎస్ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌

Brs

Brs

Power Point Presentation: తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదిన్నరేళ్లలో సాధించిన అభివృద్ధి, సృష్టించిన సంపదను తెలిపేందుకు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ భవన్‌ వేదికగా ఇవాళ ఉదయం 11 గంటలకు ‘స్వేద పత్రం’ రిలీజ్ చేయనున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం అని ఆయన చెప్పుకొచ్చారు.

Read Also: Astrology: డిసెంబర్ 23, శనివారం దినఫలాలు

రాత్రి పగలు అనే తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బ తీస్తే సహించబోమని మాజీమంంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. విఫల రాష్ట్రంగా చూపిస్తే భరించమని, అందుకే జరిగిన అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించేందుకు తాను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నట్టు కేటీఆర్‌ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం శ్వేత పత్రాల రూపంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వరుస నివేదికలు ఇచ్చారు.. తమకు కూడా అసెంబ్లీ సమావేశాల్లో గణాంకాలు ప్రవేశ పెట్టే ఛాన్స్ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు కోరారు.. కానీ, అందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నేడు తెలంగాణ భవన్ లో ఈ స్వేదపత్రం విడుదల చేస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు.

Exit mobile version