Kavitha: కవితను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ.. వాట్సప్ చాట్‌పై ప్రశ్నించే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు ఆమెను విచారించనున్నారు. ఇప్పటికే తీహార్ జైల్లో పలు ప్రశ్నలు సంధించారు. అయినా కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా ప్రశ్నించాలన్న నేపథ్యంలో తమ కస్టడీకి ఇవ్వాలని శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టును సీబీఐ కోరగా.. మూడు రోజుల పాటు విచారణకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ సీబీఐ కస్టడీలో కవితను అధికారులు విచారిస్తున్నారు.
కవితను సీబీఐ అధికారుల బృందంలో మహిళా అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే లిక్కర్ పాలసీ కేసులో కవితనే కీలక సూత్రధారి, పాత్రధారిగా సీబీఐ పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత రూ.100 కోట్లు ముడుపులు ముట్టజెప్పినట్లు సీబీఐ వెల్లడించింది. సౌత్ గ్రూప్ నుంచి ఆమె డబ్బు సమకూర్చినట్లుగా తెలిపింది. నిందితులు అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సఫ్ చాట్స్‌పై ప్రధానంగా కవితను ప్రశ్నించనున్నట్లు సమాచారం. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవి పర్యవేక్షణలో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.
Also Read
ఇదిలా ఉంటే కవితను సోదరుడు కేటీఆర్ కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. సీబీఐ కస్టడీలో కవితను కలిసి పరామర్శించనున్నారు. కేటీఆర్‌తో పాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా కలిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Trump-Iran: ‘వాస్తవ ప్రపంచంలో జీవించండి’.. ట్రంప్‌కు ఇరాన్ ఘాటు రిప్లై
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్‌లో సీజేఐ సూర్యకాంత్‌కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!