Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ చర్చలో ఇటీవల జరిగిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేచింది. విపక్షపార్టీ ఎమ్మెల్యే వివేక్ చేసిన వ్యాఖ్యలపై రవాణా, పౌరసరఫరాల మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. “వివేక్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలి” అని తెలిపారు. వివేక్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదని, ఆయన 2014లోనే అసెంబ్లీకి వచ్చి ఇంకా అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. వివేక్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు. ఇకపోతే, 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వమే రూల్ ఫ్రేమ్ చేసి, అసెంబ్లీలోకి ఇతర దుస్తులు వేసుకురావద్దని నియమాలు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. నిన్న నల్ల దుస్తులు వేసుకొస్తే, అయ్యప్ప భక్తి అనుకున్నాం… కానీ, ఈ రోజు ఆటో డ్రైవర్ దుస్తులు వేసుకొచ్చారని తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాన్నీ తప్పుబడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా వ్యవహరిస్తున్నారంటే అది బీఆర్ఎస్ వ్యవహారం అని మండిపడ్డారు. ఈ క్రమంలో, బీఆర్ఎస్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఆయన విమర్శించారు. అయితే, వివేక్ చేసిన వ్యాఖ్యలను 320 రూల్ ప్రకారం తొలగించినట్లు స్పీకర్ ప్రకటించారు. కానీ, వివేక్ తన వ్యాఖ్యలను మరొకసారి పునరుద్ఘాటిస్తూ, 10 శాతం లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.