Harish Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే.. ఈ రోజు కూడా మాగంటి గోపినాథ్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు మరోసారి ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు.
Murder Mystery : బాచుపల్లిలో ట్రావెల్ బ్యాగ్ హత్య కేసు చేధించిన పోలీసులు..
అయితే.. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, ఇతర పలువురు పార్టీ నేతలు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం గోపీనాథ్ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నారని, చికిత్సకు ప్రతిస్పందిస్తున్నారని హరీష్ రావు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ వర్గం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
