NTV Telugu Site icon

Lasya Nanditha Last Rites: ముగిసిన లాస్య నందిత అంత్యక్రియలు

Lasya Nanditha Last Rites

Lasya Nanditha Last Rites

Lasya Nanditha Last Rites: కారు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి. మారేడ్‌పల్లి హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే లాస్యనందిత భౌతికకాయం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాళులర్పించారు. లాస్యనందిత కుటుంబసభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు లాస్య నందిత భౌతికకాయానికి నివాళులర్పించారు. ఇదిలా ఉండగా..హైదరాబాద్‌ కార్ఖానాలోని ఆమె ఇంటి నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కాగా.. మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌ రెడ్డి లాస్యనందిత పాడెను మోశారు.

Read Also: MLA Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై కేసు నమోదు