NTV Telugu Site icon

Kadiyam Srihari: కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య!

Kadiyam Srihari, Kavya

Kadiyam Srihari, Kavya

Kadiyam Srihari, Kavya Joins Congress: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో వారు కాంగ్రెస్‌లో చేరారు. శ్రీహరి, కావ్యలకు దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇటీవల కడియం కావ్యకు బీఆర్‌ఎస్ వరంగల్‌ లోక్‌సభ స్థానంలో టికెట్‌ ఇచ్చింది. అయితే బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసే ఉద్దేశం లేదంటూ ఆమె నిరాకరించిన సంగతి తెలిసిందే. కడియం కావ్యకు కాంగ్రెస్‌ వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేత కే కేశవరావు, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మీ శనివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.