MLA Laxma Reddy’s Election Campaign in Balanagar: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2023కి సమయం దగ్గరపడుతోంది. దాంతో ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి సీ లక్ష్మారెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బాలానగర్ మండలం గాలిగూడెం మరియు కేతిరెడ్డిపల్లి గ్రామాల్లో సీ లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. మహిళలు ఆయనకు ఘన స్వగతం పలుకుతున్నారు. లక్ష్మారెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంకు మంచి స్పందన వస్తోంది. రాత్రి కూడా జనాలు ఆయన వెంట నడుస్తున్నారు. గాలిగూడెం, కేతిరెడ్డిపల్లి గ్రామాల్లో లక్ష్మారెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బాలానగర్ మండల ముఖచిత్రం మారిందని, అభివృద్ధి మరింతగా కొనసాగడానికి కారు గుర్తుకు ఓటు వేసి లక్ష మెజారిటీతో తమను గెలిపించాలని కోరారు.
Also Read: Amit Shah-Vijayashanti: సూర్యాపేటలో అమిత్ షా సభ.. రాములమ్మ సభకు హాజరవుతారా?
‘గత ప్రభుత్వాలు పల్లెలను పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడ్డాక పల్లెల రూపురేఖలను బీఆర్ఎస్ మార్చింది. గ్రామాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఏర్పాటు చేశాం. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు ఏర్పాటు చేసి అంటు వ్యాధులు ప్రబలకుండా గ్రామాలను, తండాలను కాపాడుకుంటున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బాలానగర్ మండల ముఖచిత్రం మారింది. అభివృద్ధి మరింతగా కొనసాగడానికి కారు గుర్తుకు ఓటు వేసి లక్ష మెజారిటీతో గెలిపించాలి’ అని లక్ష్మారెడ్డి అన్నారు.