Padi Kaushik Reddy: తెలంగాణలో రాజకీయ వేడెక్కింది. సంక్రాంతి పండగ సందర్భంలోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. నిన్న కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశం తీవ్ర రసాభాసకు దారితీసింది. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, కౌశిక్ రెడ్డి తనను దూషించడమే కాకుండా దాడి చేయడానికి ప్రయత్నించారని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సంజయ్ విజ్ఞప్తి చేశారు. పోలీసుల ముందు తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన సంజయ్, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరారు.
కౌశిక్ రెడ్డిపై ఇప్పటివరకు మూడు కేసులు నమోదు అయ్యాయి.
సంజయ్ పర్సనల్ అసిస్టెంట్ ఫిర్యాదు మేరకు మొదటి కేసు నమోదైంది. ఆర్డీవో మహేశ్వర్ కౌశిక్ రెడ్డి సమావేశంలో గందరగోళానికి కారణమయ్యారని ఫిర్యాదు చేశారు. గ్రంథాలయ చైర్మన్ మల్లేశం, తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ మూడో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకొని, కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పర ఆరోపణలు, కౌంటర్ ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డిని తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందడంతో, బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రతిస్పందించారు.
ఈ ఉదంతం తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ వేడి మరింత పెంచింది. ఒకవైపు బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డిని సమర్థించగా, మరోవైపు కాంగ్రెస్ ఈ ఘటనను బీఆర్ఎస్ కుట్రగా అభివర్ణిస్తోంది. ఇక, ఈ వ్యవహారంలో ఏ పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే.
China Manja : పాతబస్తీలో భారీగా చైనా మాంజా పట్టివేత