NTV Telugu Site icon

BRS Meeting: నేడు మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ

Brs Meeting

Brs Meeting

BRS Meeting: ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్రలో సభలు నిర్వహించిన బీఆర్‌ఎస్ మరో భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్‌ఎస్ భారీ జనసమీకరణతో ప్రజలను, నేతలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది. గతంలో నాందేడ్, కాందర్ లోహ సభలతో మహారాష్ట్ర రాజకీయాల్లో దృష్టిని ఆకర్షించిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు ఔరంగాబాద్‌ సభ కోసం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఔరంగాబాద్ ఛత్రపతి శంభాజీనగర్‌లోని జబిందా మైదానంలో బీఆర్‌ఎస్‌ సభను నిర్వహిస్తోంది. ఇవాళ సభకు బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ హాజరకానున్నారు. రాష్ట్రం నుంచి వెళ్లిన బీఆర్‌ఎస్ నేతలు అక్కడ జనసమీకరణపై కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్, బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ సహా తదితరులు కొంతకాలంగా ఔరంగబాద్‌లోనే ఉండి సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also: Paper Leak Case: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై నేడు హైకోర్టులో విచారణ

చాలా కాలం నుంచి మరాఠా ప్రజల్లో ఆలోచన రేకెత్తించిలా బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తోంది. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ దృష్టి సారించింది. వివిధ పార్టీల నుంచి నేతలు చేరేలా ప్రోత్సహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇవాళ కేసీఆర్ సమక్షంలో 150 మందికి పైగా నేతలు బీఆర్ఎస్‌లో చేరనున్నారు. 30 మందికి పైగా ఛత్రపతి శంభాజీ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్స్ బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. 50 వేల మందితో మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభ కోసం ఏర్పాట్లు చేశారు. ఇవాళ్టి సభలో కేసీఆర్‌ ఏం మాట్లాడబోతున్నారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ప్రచారం నెలకొంది. గతంలో జాతీయ అంశాలపై ప్రస్తావించిన కేసీఆర్.. ఇవాళ్టి మీటింగ్‌లో అమిత్‌ షా ఆరోపణలతో పాటు మహారాష్ట్రలోని పరిణామాలపై మాట్లాడతారా? అనే చర్చ జరుగుతోంది.