Site icon NTV Telugu

MallaReddy: బీఆర్ఎస్ ఓడింది ఊర్లలో మాత్రమే.. హైదరాబాద్లో కాదు..

Mallareddy

Mallareddy

మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మేము గెలుస్తాం అని బీజేపీ, కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. వాళ్ళు చేసిందేమీ లేదు.. స్వాత్యంత్రం వచ్చి 75 ఏళ్లైన ఏ రంగం బాగుపడలేదు.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు ఓటు అడిగే హక్కు లేదు.. మల్కాజ్ గిరి పార్లమెంట్ లో వాళ్ళకి క్యాడర్ లేదు.. ఏం మొహం పెట్టుకొని వాళ్లు ఓట్లు అడుగుతారు అని ఆయన మండిపడ్డారు. గ్యాస్ సిలెండర్ ధర 1200 రూపాయలకు పెంచి పేదలను దోచుకుంటున్నారు.. దేశ ప్రజలను జాతీయ పార్టీలు మోసం చేశాయని మల్లారెడ్డి అన్నారు.

Read Also: YV Subba Reddy: ఆ కంటైనర్‌లో వెళ్లింది ఫర్నిచర్‌..! వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు..

బీజేపీ, కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు.. ఎట్లా గెలుస్తుంది!.. మొన్న ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్ కు ఓటు వేశామో అని ప్రజలు అనుకుంటున్నారు అని మల్లారెడ్డి అన్నారు. హైదరాబాద్, మల్కాజ్ గిరిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు.. ఊర్లలో మాత్రమే బీఆర్ఎస్ ఓడిపోయింది.. హైదరాబాద్ లో గెలవడానికి కారణం కేటీఆర్ చేసిన అభివృద్ది.. ప్రతిపక్షాలకు ఓటు బ్యాంక్ లేదు.. ఎండాకాలం వస్తే నిండు కుండల చెరువులు, ప్రాజెక్టులు ఉండే.. కానీ ఇప్పుడు ఎండిపోయినాయి.. మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావాలి, ప్రాజెక్టుల్లో నీళ్ళు రావాలి అని ఆయన పేర్కొన్నారు. గెలుపు మనదే.. మళ్లీ గెలిచేది కేసీఆరే అని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

Exit mobile version