BC Reservations: తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీ రిజర్వేషన్ల విషయంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ విశ్వాస ఘాతుకానికి పాల్పడుతోందని వారు ఆరోపించారు.
విద్యార్థులకు, ప్రొఫెషనల్స్‌కు బెస్ట్ ఆప్షన్గా కొత్తగా Samsung Galaxy Tab A11.. ధర ఎంతంటే?
ఈ సమావేశంలో మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీసీలకు ఉన్న 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ, వాటిని ప్రభుత్వం నీరుగారుస్తోందని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కుల గణన జరగలేదని, బీసీ బిల్లు గురించి మాట్లాడడానికి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినా దీనిపై మాట్లాడలేదని ఆయన విమర్శించారు. ఒకవేళ తమ మనసు గాయపడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
AP High Court: వైఎస్ జగన్ పిటిషన్‌పై విచారణ.. నోటీసులు జారీ చేసిన హైకోర్టు
అలాగే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం జీవో ఇవ్వకముందే కొందరు కోర్టుకు వెళ్ళడంపై ప్రశ్నించారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదని, రాష్ట్రంలో బీసీలకు మంత్రి పదవులు కూడా కేటాయించలేదని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందని, కేవలం కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ బీసీల తరపున పోరాడుతుందని స్పష్టం చేశారు. అలాగే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 42% జీవో ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతూ, గత 22 నెలల్లో ఆ జీవో ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. జీవో ఇవ్వకుండానే కొందరు కోర్టుకు వెళ్ళడం కాంగ్రెస్ కుట్ర అని ఆరోపించారు. అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం “బీసీ రిజర్వేషన్లు అనే పులిపై స్వారీ చేస్తోందని” తాము ముందే చెప్పామని, మాట తప్పితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
