నేనావత్ సూర్య నాయక్ లాక్ అప్ డెత్ పై సమగ్ర దర్యాప్తు చేయాలి అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. అన్న దమ్ముల పంచాయతీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గిరిజనుడి మృతికి కారణం అయ్యారు.. అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి.. సీనియర్ అధికారి చేత సమగ్ర దర్యాప్తు చేపట్టాలి.. సూర్య నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలి అని ఆమె కోరారు. ఇక, సూర్య నాయక్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తెలిపారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ దారి తప్పుతుంది అని మండిపడ్డారు. రాజకీయ కక్ష్యాలకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు. డీజీపీ రవిగుప్తా సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Food Poisoning: పెళ్లి భోజనాల్లో ఫుడ్ పాయిజనింగ్.. 80 మందికి అస్వస్థత..
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. పది సంవత్సరాల నుండి ఫ్రెండ్లీ పోలీసింగ్ లో మేము ఎక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడలేదు.. అధికారం ఎవరికి శాశ్వతం కాదు.. ఇలాంటి సంఘటనలా వాళ్ళ రాష్ట్ర ప్రతిష్ట మసకబరుతుంది.. టీఆర్ఎస్ నాయకుల ఇళ్ల దగ్గర డీజే సాంగ్స్ బాణాసంచా కాల్చి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు అంటూ బాల్క సుమన్ మండిపడ్డారు.