పార్టీలు మారే చరిత్ర తనది కాదని, పార్టీ మారుతున్నట్టు వచ్చే అసత్య ప్రచారాలను అస్సలు నమ్మొద్దని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేష్ అన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేని కొంతమంది దద్దమ్మలు, పిరికిపందలు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరూరి రమేష్ మాట మిద నిలబడే వ్యక్తి అని, నమ్ముకున్న కార్యకర్తని కంటికిరెప్పలా కాపాడుకునే వ్యక్తి అని తెలిపారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం ఎవరిని నిలబెట్టినా.. జిల్లా అద్యక్షునిగా భారీ మెజారిటితో గెలిపిస్తానని అరూరి రమేష్ చెప్పారు. అరూరి ఎప్పుడు కేసీఆర్ మనిషే అని స్పష్టం చేశారు.
‘గత కొన్నిరోజులుగా నేను పార్టీ మారుతున్నట్టు వచ్చే అసత్య ప్రచారాలను ఎవరు నమ్మొద్దు. 2012లో పీఆర్పీ పార్టీ విలీనం తర్వాత ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాను. అప్పడినుండి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పార్టీ కోసం అనేక కార్యక్రమాలు చేశాను. నా పని తీరును గుర్తించిన కేసీఆర్.. వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్గిగా, వర్ధన్నపేట నియోజకవర్గ శాసన సభ్యునిగా మరియు పార్టీ జిల్లా అద్యక్షునిగా అవకాశం ఇచ్చారు. నియోజకవర్గ అబివృద్ది కోసం మరియు పార్టీ కార్యక్రమాల్లో అనుక్షణం కష్టపడుతూ పని చేస్తున్నా. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేని కొంతమంది దద్దమ్మలు, పిరికిపందలు నాపై లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారు’ అని అరూరి రమేష్ అన్నారు.
Also Read: Renuka Chowdhury: ఎన్టీఆర్ నేర్పిన నైపుణ్యంతోనే చంద్రబాబు, రేవంత్ సీఎంలుగా రాణిస్తున్నారు!
‘ఆరూరి రమేష్ మాట మిద నిలబడే వ్యక్తి. నమ్ముకున్న కార్యకర్తని కంటికిరెప్పలా కాపాడుకునే వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీ కోసం అనుక్షణం సైనికుడిలా పని చేసే వ్యక్తిని నేడు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎవరిని నిలబెట్టినా.. జిల్లా అద్యక్షునిగా భారీ మెజారిటితో గెలిపిస్తాను. అరూరి ఎప్పుడు కేసీఆర్ మనిషే. కార్యకర్తలు ఎవరు వదంతులను నమ్మవొద్దు. గెలిచినా, ఓడినా నిరంతరం నియోజకవర్గ అభివృధ్ది కోసం మరియు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కష్ట పడుదాం’ అని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేష్ పేర్కొన్నారు.