NTV Telugu Site icon

BRS: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్..

Brs

Brs

తెలంగాణలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించిన బీఆర్ఎస్ కు భంగపాటు ఎదురైంది. అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రతిపక్ష స్థానంలో నిలిచింది. కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఒకవైపు.. పార్టీలో నుంచి కీలక నేతలు వేరే పార్టీ వైపు వెళ్తున్నా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భయం బెదురు లేకుండా పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా ఎక్కువ స్థానాల్లోనే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలుపొందుతారని బీఆర్ఎస్ ముఖ్య నేతలు అంటున్నారు.

TDP vs YCP Fight: వాదంపల్లిలో ఉద్రిక్తత.. నీళ్లు పట్టుకునే విషయంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

ఈ క్రమంలోనే.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. కాగా.. రేపు తెలంగాణ భవన్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గులాబీ బాస్ కేసీఆర్ హాజరు కానున్నారు. తమకు సిట్టింగ్ స్థానంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని దక్కించుకోవాలని బీఆర్ఎస్ యోచనలో ఉంది. ఈ క్రమంలోనే.. కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

Bhatti Vikramarka: ప్రజలు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపారు..

కాగా.. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికకు సంబంధించి మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి బరిలో నిలవగా.. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మరోసారి అధిష్ఠానం అవకాశం కల్పించింది. అయితే.. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి.