NTV Telugu Site icon

KCR: సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత సంతాపం..

Kcr

Kcr

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాగా.. కొన్ని రోజులుగా ఆయన ఫీవర్, లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో.. ఆగస్టు 19న ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. సీతారాం ఏచూరి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Matka: చివరి రౌండ్ లో వరుణ్ తేజ్ ‘మట్కా’

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) జాతీయ ప్రధాన కార్యదర్శి, సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్ర శేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి.. విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీకి కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా అంచలంచలుగా ఎదిగి ప్రజా పక్షం వహించారని.. వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. సీతారాం ఏచూరి మరణం భారత కార్మిక లోకానికి, లౌకిక వాదానికి తీరని లోటని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఏచూరి మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Read Also: AP CM Chandrababu: సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి భేటీ