నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. కానీ, బడ్జెట్ రోజు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నట్లు తెలిపారు. ఇక, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. కాగా, ప్రమాదవశాత్తు తుంటి ఎముక విరగి సర్జరీ అవడంతో ఆయన రెండు నెలలుగా బయటికి రాలేదు.. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ సెషన్ కి కేసీఆర్ దూరం అయ్యారు.
Read Also: Ishan Kishan: త్వరలోకి మైదానంలోకి ఇషాన్ ఎంట్రీ.. బరోడా స్టేడియంలో ప్రాక్టీస్
అయితే, ఈ మధ్యే గాయం నుంచి కోలుకున్న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అంతేగాక వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ కి క్యాంపెయినింగ్ కూడా చేయనున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా, మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్ స్థానాలకు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఈ సారి ప్రతిపక్ష పార్టీ నేతగా వ్యవహరించనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాతో కేసీఆర్ అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో అధికార పార్టీకి కేసీఆర్ ఎలాంటి సవాళ్లు విసురుతారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
