NTV Telugu Site icon

Lok Sabha Election 2024: మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌ సభ స్థానాలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామినేషన్‌

Lok Sabha Election 2024

Lok Sabha Election 2024

Lok Sabha Election 2024: తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా మే 13న పోలింగ్ జరగనుండగా.. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. గడువు ముగియడానికి ఒక్కరోజే ఉండడంతో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, అనుచరులతో కలిసి సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన గాలి అనిల్ కుమార్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

Read also: AP-TS Nominations: తెలుగు రాష్ట్రాల్లో రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం

ఈ సందర్భంగా అభ్యర్థి అనిల్ కుమార్ వెంట బీఆర్ ఎస్ కీలక నేత, రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీరెడ్డి ఉన్నారు. మరోవైపు మెదక్ లోక్‌సభ స్థానానికి బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి ఈరోజు సెట్ 1 నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వెంకట్రామ్ రెడ్డి వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్, బీఆర్ఎస్ నాయకురాలు పుష్పా నగేశ్ యాదవ్ ఉన్నారు. కాగా బీఆర్ఎస్ కరీంనగర్ లోక్ సభ అభ్యర్థి వినోద్ కుమార్ తరపున మరో నామినేషన్ సెట్ ను జెడ్పి ఛైర్మెన్ కనుమల్ల విజయ, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి దాఖలు చేశారు.
Maheshwar Reddy: 14 స్థానాలు గెలువరని సవాల్ విసిరా.. సీఎం రేవంత్‌ స్పందించలే..