అస్సాం రాష్ట్రం లఖింపూర్ జిల్లాలో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు తమ నివాసాలుగా పైకప్పులపై నివసించవలసి వస్తోంది. ఇక్కడ ఓ హృదయ విదారకమైన సంఘటన చోటుచేసుకుంది. వరదల కారణంగా రోడ్లు మూసుకుపోవడంతో ఓ టీనేజ్ బాలిక చికిత్స పొందలేక మృతి చెందింది. బాలిక మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు వాహనం వెళ్లే మార్గం లేదు. అలాంటి పరిస్థితిలో ఇద్దరు అన్నదమ్ములు తమ సోదరి మృతదేహాన్ని భుజాలపై ఎత్తుకుని గ్రామానికి చేరుకున్నారు.
READ MORE: Ford Capri EV: సరికొత్త లుక్ లో ఫోర్డ్ కాప్రీ ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 627 కి.మీ
మైలానీ పోలీస్ స్టేషన్‌లోని ఎలంగాంజ్ మహారాజ్ నగర్‌లో నివసిస్తున్న శివాని (15) టైఫాయిడ్‌తో మరణించింది. శివాని 12వ తరగతి విద్యార్థిని. 2 రోజుల క్రితం పాలియాలో శివాని ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్ దగ్గరకు వెళ్లగా టైఫాయిడ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో డాక్టర్ శివానికి మందు ఇచ్చి ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత బాలిక పరిస్థితి విషమంగా మారింది. వర్షం కారణంగా, పాలియా నగరం జలమయమైంది. నీటిమట్టం పెరగడంతో చుట్టుపక్కల రోడ్లన్నీ మూసుకుపోయాయి. రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వాహనాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో తన సోదరికి మెరుగైన వైద్యం అందలేదని.. దీంతో ఆమె మరణించిందని శివాని సోదరుడు మనోజ్ చెప్పాడు. వాహనం వచ్చేందుకు మార్గం లేకపోవడంతో పడవ సాయంతో నది దాటారు. అక్కడి నుంచి గ్రామం అయిదు కిలోమీటర్లు ఉంది.
READ MORE:Mungeli Agniveer missing: అగ్నివీర్ మిస్సింగ్..గోడ దూకి తప్పించుకున్నట్లు అధికారుల వివరణ
అన్నదమ్ములిద్దరూ వంతులవారీగా తమ సోదరి మృతదేహాన్ని భుజాలపై వేసుకుని రైలు మార్గం వెంబడి స్వగ్రామానికి వెళ్లడం కనిపించింది. ఈ ఘటనపై అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఎవరూ స్పందించలేదు. తన సోదరి పల్లకీని భుజాన వేసుకోవాల్సిన అన్నదమ్ములు.. నేడు తమ సోదరి మృతదేహాన్ని భుజాలపై వేసుకుని 5 కిలోమీటర్లు కాలినడకన తమ గ్రామానికి వచ్చారని శివాని తండ్రి దేవేంద్ర కన్నీరుమున్నీరుగా విలపించారు.