Road Accident: ఎటు చూసినా రాఖీ పౌర్ణమి సందడి కనిపిస్తోంది.. సోదరులకు వెళ్లే అక్కలు, చెల్లెళ్లు ఓవైపు.. వారి దగ్గరకు వెళ్లే సోదరులతో మరోవైపు రోడ్లు రద్దీగా మారిపోయాయి.. అయితే, పండుగ పూట కొన్ని విషాద ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో తన చెల్లి వద్దకు రాఖీ కట్టించుకోవడానికి వెళ్తూ.. అనంత లోకాలకు చేరాడు ఓ యువకుడు..
Read Also: Sister Sends Rakhi: 14 ఏళ్లుగా ఎదురుచూపులు.. పాక్‌కు పోస్ట్ చేసిన రాఖీ
తాళ్లపూడి మండలం పెద్దవం గ్రామానికి చెందిన గండేపల్లి శంకర్.. దేవరపల్లి మండలం యాదవోలులో ఉన్న తన చెల్లి వద్దకు రాఖీ కట్టించుకోవడానికి బయలుదేరాడు… ఇంతలో గోపాలపురం మండలం వెంకటాయపాలెం వద్దకు వచ్చేసరికి బైక్ యాక్సిడెంట్ రూపంలో మృత్యువు కబలించింది.. కుటుంబానికి పెద్దదిక్కుగా తన తండ్రి డయాలసిస్ పేషెంట్ కావడంతో కుటుంబ పోషణను భుజాన వేసుకొని కంటికి రెప్పలా చూసుకునే కొడుకు ఒక్కసారిగా దూరం అవడం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకంలోకి నెట్టినట్టు అయ్యింది.. ఈ ఘటనతో పెద్దవం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి..
