NTV Telugu Site icon

BRO : సినిమాను సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న మేకర్స్..

Whatsapp Image 2023 07 12 At 2.57.19 Pm

Whatsapp Image 2023 07 12 At 2.57.19 Pm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి తేజ్ కలిసి నటించిన సినిమా బ్రో ది అవతార్. ఈ సినిమా ను ఈ నెల 28 వ తేదీన ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.తొలిసారి పవన్‌, సాయిధరమ్‌ తేజ్‌ ఒకేసారి స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. విలక్షణ నటుడు మరియు దర్శకుడు అయిన సముద్రఖని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా తమిళంలో సూపర్‌ హిట్టయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే.ఫాంటసీ డ్రామా నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కింది.. సినిమా విడుదల తేదీ దగ్గరపడటం తో ఈ క్రమంలో మేకర్స్‌ వరుసగా ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.తాజాగా చిత్ర యూనిట్ గోదావరి నదిలో బోట్లతో సరికొత్త గా సినిమా టైటిల్‌ను ప్రదర్శించారు.. ఇలా వినూత్నంగా ప్రమోషన్లతో ప్రేక్షకులలో మంచి ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తున్నారు మేకర్స్.

ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్‌ మరియు మై డియర్‌ మార్కండేయా పాట కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.అలాగే ఈ చిత్రం మరో సాంగ్ ను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. బ్రో మోషన్ పోస్టర్ లో వినిపించే శ్లోకం ఫుల్ వెర్షన్ ను ఈ శనివారం లేదా ఆదివారం విడుదల చేయబోతున్నట్లు సమాచారం.పీపుల్ మీడియా బ్యానర్‌పై ఈ సినిమా భారీ స్థాయిలో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఇక బ్రో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకు భారీ రేంజ్‌లో బిజినెస్‌ కూడా జరిగింది.. ఈ సినిమా టోటల్ బిజినెస్‌ వంద కోట్లకు పైగానే జరిగిందని తెలుస్తుంది.ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదల అయిన తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Show comments