త్రివిక్రమ్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పని లేదు. మాటల రచయిత గా తన కెరీర్ ను మొదలు పెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు త్రివిక్రమ్. తన డైలాగ్స్ తెలుగులో పిచ్చ పాపులర్ అయ్యాయి. తన మాటలతో ప్రేక్షకులని మంత్రముగ్దుల్ని చేస్తారు త్రివిక్రమ్.దర్శకుడు కాకముందు ఎన్నో చిత్రాలకు రైటర్ గా పనిచేశారు త్రివిక్రమ్. ఆయన తెరకెక్కించిన ఖలేజా మరియు అజ్ఞాతవాసి సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ఓ పక్క సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే.. మరోపక్క పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకు కూడా స్క్రీన్ ప్లే ను అందిస్తున్నారు త్రివిక్రమ్. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు.
అలాగే తాజాగా విడుదలకి సిద్ధంగా వున్న ‘బ్రో ది అవతార్ ‘సినిమాకు కూడా ఆయనే స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్-సాయిధరమ్ తేజ్ కలిసి నటించడం జరిగింది.ఈ మూవీ తమిళ్ చిత్రం వినోదయ సిత్తం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ మూవీని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కు జంటగా కేతిక శర్మ నటిస్తోంది. మరో హీరోయిన్ ప్రియాప్రకాశ్ వారియర్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.’బ్రో’ సినిమాకు స్క్రీన్ ప్లే అందించినందుకు గాను త్రివిక్రమ్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.. ఈ మూవీ కోసం మాటల మాంత్రికుడు రూ. 15 కోట్ల రూపాయల భారీ పారితోషికం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేశ్ బాబుతో ‘గుంటూరు కారం’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు సమాచారం
