NTV Telugu Site icon

Rishi Sunak meet Modi : మోదీ, రిషి సునాక్ భేటీ ముహూర్తం ఖరారు.. అప్పుడే దానిపై చర్చ

Rishi Sunak Modi

Rishi Sunak Modi

Rishi Sunak meet Modi : బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్, భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కాబోతున్నారు. ఇండొనేషియాలోని బాలిలో వచ్చే నెల జీ20 లీడర్ షిప్ సమ్మిట్ జరగబోతోంది. ఈ సమావేశాల్లో ఇరువురూ ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు అంగీకారం తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించి బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ దేశాలు ప్రపంచ ఆర్థిక శక్తులుగా వికసించేందుకు కలిసికట్టుగా పనిచేయడానికి అధినేతలు సమ్మతం తెలిపారు. ఇండోనేషియాలో జరిగే టీ20 సదస్సులో వీరివురూ పరస్పర చర్చలు జరుపుతార‌ని ప్రకటనలో పేర్కొంది. ఇటీవ‌ల బ్రిట‌న్ ప్రధానిగా రిషి సునాక్ ఏక‌గ్రీవంగా ఎంపికైన విష‌యం విధిత‌మే. ప్రధానిగా సునాక్ బాధ్యత‌లు సైతం స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా గురువారం భార‌త్ ప్రధాని న‌రేంద్ర మోదీ ఫోన్ లో రుషి సునాక్ కు ప్రత్యేకంగా అభినంద‌న‌లు తెలిపారు.

Read Also: Horrific Accident: 70అడుగుల లోతులో పడిన కారు.. పండుగపూట విషాదం

ఈ సందర్భంగా మోదీ ఇరుదేశాల మధ్య ‘ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్’ (FTA) అంశాన్ని రిషి సునాక్ దృష్టికి తీసుకెళ్లారు. పరస్పర సంభాషణ అనంతరం ఇరువురూ ట్విటర్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ ఒప్పందం దీపావళి నాటికల్లా పూర్తవుతుందని అంతా భావించారు. కానీ బ్రిటన్‌లో అస్థిర ప్రభుత్వం కారణంగా ముందుకు కదల్లేదు.

Read Also: Man Dance with Crocodile : అదేం.. నీ గర్ల్ ఫ్రెండ్ కాదురా అయ్యా.. మొసలితో సాల్సా డ్యాన్స్!

Show comments