NTV Telugu Site icon

Sunrisers Fans : సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కోచ్ గా యువరాజ్ సింగ్‌ని తీసుకు రండి..?

Yuvi

Yuvi

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్‌లో ఒకటైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. 2021 ఏడాది నుంచి వరుస పరాజయాలతో సతమతం అవుతుంది. 2021 సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్, 2022 సీజన్‌లో 8వ స్థానంలో నిలిచింది. ఈసారి ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ కూడా అయ్యింది. 2021 సీజన్‌లో కోచ్‌గా ఉన్న ట్రేవర్ బేలిస్‌ని తప్పించిన సన్‌రైజర్స్, టామ్ మూడీకి హెడ్ కోచ్‌గా బాధ్యతలను అప్పజేప్పింది. ఇక ఈ ఏడాది ( 2023 ) విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు.

Also Read : Brain Cancer: బ్రెయిన్ క్యాన్సర్ చికిత్సలో ముందడుగు.. కీలక విషయాన్ని కనుగొన్న భారతీయురాలు..

లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా, సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. 2022 సీజన్‌లో వరుసగా ఐదు విజయాలు అందుకున్న సన‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత వరుస ఓటములతో ప్లేఆఫ్స్ నుంచి తప్పుకుంది. దీంతో 2023 సీజన్ ఆరంభానికి ముందు బ్రియాన్ లారాని సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా నియమించింది. అంటే గత మూడు సీజన్లలో ఆరెంజ్ ఆర్మీకి ముగ్గురు కోచ్‌లు మారారు. అయినా వారికి ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు.

Also Read : Sajjala : ఎంపీ అవినాష్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు..

మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్రమ్, హారీ బ్రూక్, అబ్దుల్ సమద్.. అందరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. క్లాసిన్ ఒక్కడే ఈ సీజన్‌లో అంచనాలను మించి రాణించాడు. గ్లెన్ ఫిలిప్స్‌ను ఓ మ్యాచ్‌లో ఆడించి, ఆ తర్వాతి మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడని తిరిగి కూర్చోబెట్టింది టీమ్ మేనేజ్‌మెంట్. పేరుకి పటిష్టమైన బౌలింగ్, బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమ్ ఆరెంజ్ ఆర్మీయే. భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఫజల్‌హక్ ఫరూక్, కార్తీక్ త్యాగి, మయాంక్ మార్కండే, అదిల్ రషీద్ ఇలా వరల్డ్ క్లాస్ బౌలర్లు, సన్‌రైజర్స్‌లో పుషల్కంగా ఉన్నారు. అయితే వీరి నుంచి మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌లు అయితే ఒక్కటి కూడా రాలేదు. నటరాజన్ తో పాటు మిగిలిన బౌలర్లు అందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు.

Also Read : Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచై ఇల్లునే కొనుగోలు చేసిన నటుడు.. ఎవరో తెలుసా..?

ఇక రూ.13 కోట్లు పెట్టి కొన్న హారీ బ్రూక్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కూడా ఈ సీజన్‌లో పూర్తిగా విఫలమయ్యారు. క్లాసిన్ ఒక్కడే కడవరకూ పోరాడుతూ ఆశలు రేపుతున్నా, సరైన సపోర్ట్ లేకపోవడంతో విజయాలు అందించలేకపోతున్నాడు. దీంతో బ్రియాన్ లారాని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించి, యువరాజ్ సింగ్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు ఇవ్వాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. యువీ ఎస్ ఆర్ హెచ్ హెడ్ కోచ్ గా వస్తే.. దేశవాళీ కుర్రాళ్ల నుంచి అదిరిపోయే పర్పామెన్స్ రాబడతాడని హైదరాబాద్ అభిమానులు అంటున్నారు. మరీ చూడాలి ఎస్ ఆర్ హెచ్ టీమ్ మేనేజ్‌మెంట్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది.

Show comments