NTV Telugu Site icon

Brinda: ఇంట్రెస్టింగ్ కంటెంట్‭తో రాబోతున్న త్రిష “బృంద”..

Brinda

Brinda

Brinda Streaming in Sony liv from august 2: స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న త్రిష కృష్ణన్ డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ కూడా వచ్చింది. త్రిష కృష్ణన్ పోలీస్ గా నటించిన “బృందా” వెబ్ సిరీస్ ఆగస్టు 2 నుంచి సోనీ లీవ్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. మూవీ మేకర్స్ తాజాగా వెబ్ సిరీస్ సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ అమాంతం ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ ట్రైలర్ వీడియోలో త్రిష పోలీస్ ఎస్ఐగా కనబడుతుంది. సస్పెండ్ చేసిన ఎస్ఐ పాత్రను త్రిష సినిమాల్లో పోషించింది.

Godavari Floods: భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరనున్న గోదావరి.. ఏ క్షణమైనా మొదటి ప్రమాద హెచ్చరిక

విడుదలైన ట్రైలర్ పరంగా చూస్తే.. ఈ వెబ్ సిరీస్ ఓ క్రైమ్ కేసుకు సంబంధించి చిక్కుముడిని విడిచే విధంగా కనబడుతోంది. సస్పెండ్ అయిన ఎస్సై ఓ క్రైమ్ కేసును ఏ విధంగా చేధించిందన్న విషయంపై వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ క్రైమ్, డ్రామా, మిస్టరీలతో ఆకట్టుకొనున్నది. ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ త్రిషతో పాటు ఇంద్రజిత్తు సుకుమార్, జయప్రకాష్, రవీంద్ర విజయ్, ఆమని, రాకేందు మౌళి, ఆనంద స్వామి లాంటి ప్రముఖ యాక్టర్స్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ను యడ్డింగ్ అడ్వర్టైజింగ్ ఎల్ఎల్పి బ్యానర్ పై కొల్ల ఆశిష్ నిర్మించారు. ఈ సిరీస్ లో శక్తి కాంత్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్, పాటలను అందించాడు. ఈ సీరియస్ మొత్తం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, మలయాళం, బెంగాలీ భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది.

Viral Video: అసలు ఎలా వస్తయో ఇలాంటి ఐడియాలు.. మీరూ ట్రై చేస్తే పోలా..

Show comments