ఉత్తరప్రదేశ్‌లోని చాలా స్థానాల్లో బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. అయితే, రాయ్‌బరేలీ, కైసర్‌గంజ్ లాంటి ప్రముఖ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. అయితే, బలమైన నాయకుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కైసర్‌గంజ్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు.. అందరి చూపు దీనిపైనే ఉంది. బ్రిజ్ భూషణ్ ఎన్నికల్లో పోటీ చేయని పక్షంలో ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై పార్టీ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయన టికెట్‌పై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ చెప్పుకొచ్చింది.
Read Also: Memantha Siddham Bus Yatra: 21వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఇవాళ్టి షెడ్యూల్
ఈ కేసు కోర్టులో నడుస్తుండగా, ఢిల్లీ కోర్టు ఈ నెలాఖరులోగా తీర్పు వెలువరించనుంది. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు తీర్పు చూసి అయనకు టికెట్ ఖరారు చేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌కు అనుకూలంగా నిర్ణయం వస్తే ఆయనకే టిక్కెట్ దక్కే అవకాశం ఉందన్నారు. బ్రిజ్ భూషన్ కి టికెట్ ఇవ్వకపోతే.. ఆయన సతీమణి కేతకీ సింగ్ పేరు సైతం ఎక్కువగా వినిపిస్తుంది. కేత్కీ సింగ్ గతంలో 1996 నుంచి 1998 వరకు ఎంపీగా ఉన్నారు. అయితే, తన కుటుంబంలో ఎవరికీ టికెట్ ఇవ్వడం ఇష్టం లేదని, తానే పోటీ చేయాలని భావిస్తున్నట్లు బ్రిజ్ భూషణ్ తెలిపినట్లు సమాచారం.
Read Also: Birthday Cake: కేక్ తిని బాలిక మృతి కేసు.. మరణానికి కారణం తెలిసి అంతా షాక్!
కాగా, కైసర్‌గంజ్ సీటుపై నిర్ణయం తీసుకోవడం బీజేపీకి కొంచెం కష్టంగా మారింది. మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల ఆరోపణలతో కూడిన కేసును గుర్తు చేస్తూ.. దీనిపై కోర్టు నిర్ణయం కోసం వేచి చూడాలని బీజేపీ హైకమాండ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను కోరుతోంది. మీకు అనుకూలంగా నిర్ణయం వస్తే ఎన్నికల్లో పోటీ చేయండి, లేకపోతే కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వండి అని పేర్కొన్నారు. కేత్కీ సింగ్‌ను రంగంలోకి దింపడం వల్ల మహిళా కార్డుకు బలం చేకూరుతుందని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా మహిళలను ప్రోత్సహించడం గురించి నిరంతరం పలు బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు.