NTV Telugu Site icon

Brij Bhushan: బ్రిజ్భూషణ్‌ హల్చల్.. కొడుకు నామినేషన్ వేళ 10 వేలమంది అనుచరులు, 700 వాహనాలతో ర్యాలీ..

Brij Bhushan

Brij Bhushan

భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కైసర్‌గంజ్‌ ఎంపీ టికెట్ ను ఆయన కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌ కు బీజేపీ కేటాయించింది. దీంతో శుక్రవారం నాడు కరణ్‌ నామినేషన్‌ వేయడానికి వచ్చిన సందర్భంగా ఆయన తన అనుచరగణంతో హల్ చల్ చేశారు. నామినేషన్‌కు ముందు నిర్వహించిన సభకు 10 వేలమంది పాల్గొన్నారు. వారిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్‌లు, బీజేపీ స్థానిక నేతలు ఉన్నారు. అలాగే 500-700 వరకు వాహనాలు మైదానంలో పార్క్‌ చేసినట్లు నేషనల్ మీడియాలో న్యూస్ టెలికాస్ట్ చేశారు.

Read Also: Mallu Bhatti Vikramarka: సింగరేణి నీ కాపాడుతాం.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళనివ్వం..

కాగా, ఈ వేదికపై అంతా కుర్చీల్లో కూర్చోగా.. బ్రిజ్‌ భూషణ్‌ మాత్రం ఒక రాజులా మధ్యలో ఒక సోఫాలో కూర్చుండిపోయారు. చేతిలో మైక్రోఫోన్‌ పట్టుకొని అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నామినేషన్ ప్రక్రియకు తన పెద్ద కుమారుడు, అలాగే, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు మాత్రం దూరంగా ఉండిపోయారు. ఇక, కరణ్‌ కుమార్ నామినేషన్ వేసేప్పుడు కూడా కార్యాలయం లోపలకు వెళ్లేందుకు ఐదుగురికి మాత్రమే పర్మిషన్ ఉంది. అయితే, కైసర్‌గంజ్‌ లోక్‌సభ స్థానానికి వరుసగా మూడుసార్లు ఎంపీగా బ్రిజ్‌భూషణ్‌ విజయం సాధించారు.

Read Also: Osmania University : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరో 4 కొత్త కోర్సులు

అయితే, గతేడాది జనవరిలో సాక్షి మలిక్‌, బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్‌ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ.. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఆయనపై బీజేపీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లో కమలం పార్టీ ఆయనను పక్కన బెట్టి.. తన కుమారుడికి టికెట్ కేటాయించింది. కాగా, యూపీలోని గోండా చుట్టుపక్కల ఆరు జిల్లాల్లో ఆయన హవా నడుస్తుండటంతో బీజేపీ బ్రిజ్ భూషణ్ కుటుంబానికి మద్దతుగా ఉంటుంది.