NTV Telugu Site icon

Rajastan: పెళ్లి రోజే వధువు జంప్..13రోజులు పెళ్లి బట్టల్లో మండపంలోనే ఎదురుచూసిన వరుడు

Marriage

Marriage

Rajastan: ఇటీవలి కాలంలో పెళ్లి పీటల మీద నుంచి నూతన వధువరులు పారిపోవడం ట్రెండ్ అయింది. ఇలాంటి ఘటనలు ఎక్కువగా వార్తల్లో వింటున్నాం. అలాంటి ఘటనే మరొకటి రాజస్థాన్లో వెలుగు చూసింది. అది కూడా.. పెళ్లి కూతురు కోసం.. వరుడు 13 రోజులపాటు పెళ్లి బట్టల్లోనే వస్తుందని ఎదురు చూశాడు. వివరాలలోకి వెళితే..రాజస్థాన్లోని పాలీ జిల్లాలో ఇది జరిగింది. అక్కడ సౌనా గ్రామానికి చెందిన సకారం అనే వ్యక్తి కూతురైన మనీషాకు వారి దగ్గర బంధువైన శ్రవణ్ కుమార్ తో పెళ్లి నిశ్చయించారు. వరుడి తరపు వారంతా వధువు గ్రామానికి వెళ్లారు. పెళ్లికూతురు తరపు వారు వారికి ఘనంగా స్వాగతం పలికారు. మే 4న ఉదయం వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి తంతు మొదలైంది. పెళ్లి కుమార్తెను తీసుకురావాలంటూ పురోహితుడు తెలిపాడు.

Read Also:Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు నాయకుడు కాదు మానిప్యులేటర్.. సజ్జల సీరియస్‌ కామెంట్స్

ఈలోగా వధువు రావడానికి కొంచెం టైం పడుతుందంటూ పెళ్లి కుమార్తె తరపు వారు అతనికి తెలిపారు. అయితే, మనీషా తనకు విపరీతమైన కడుపునొప్పి వస్తుందని చెప్పి ఆ సమయానికి ఇంటి వెనుకకు వెళ్లింది. అక్కడ తనకోసం అప్పటికే వేచి ఉన్న బంధువుతో కలిసి అక్కడి నుంచి పారిపోయింది. కూతురు ఎంతసేపైనా రాకపోవడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులంతా వెతికారు. కానీ, ఆమె జాడ కనిపెట్టలేకపోయారు. దీని మీద పెళ్లి కుమార్తె తండ్రి మాట్లాడుతూ.. నెమ్మదిగా తన కూతురు మేనమామ కొడుకు అయిన భరత్ కుమార్ తో వెళ్లిపోయిందని చెప్పాడు. ఎలాగో ఆమె ఆచూకీ కనిపెట్టిన బంధువులు ఆమెకు ఎంత చెప్పినా ఈ పెళ్లికి ఆమె ససేమిరా అంది.

Read Also:King of Kotha: ఈ ఓనమ్ కి బాక్సాఫీస్ ని కబ్జా చేయనున్న దుల్కర్

తర్వాత ఇంటికి తిరిగి వచ్చినా కూడా పెళ్లి చేసుకోనని మొండికేసి కూర్చుంది. ఇక మరోవైపు.. ఆమెనే చేసుకుంటానని పట్టుబట్టిన వరుడు పెళ్లి బట్టల్లోనే మండపంలో ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఇలా ఏకంగా 13 రోజుల వరకు.. పెళ్లి బట్టలతోపాటు పెట్టుకున్న పగిడి కూడా తీయకుండా ఎదురు చూశాడు. పెళ్లి మండపాన్ని.. అదే అలంకరణలతో అలాగే ఉంచారు. ఎట్టకేలకి 13 రోజుల తర్వాత…పెళ్లి కుమార్తె తన మొండిపట్టు వీడి కళ్యాణ మండపానికి చేరుకుంది. అలా 16వ తేదీన వీరి వివాహం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది.