Site icon NTV Telugu

Groom Becomes Father: శోభనం రాత్రే తండ్రైన పెళ్లికొడుకు.. ఎలాగంటే..?

Groom Becomes Father

Groom Becomes Father

Groom Becomes Father: ఉత్తరప్రదేశ్‌ లోని రాంపూర్ జిల్లా అజీమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి అయిన తొలి రాత్రే పెళ్లికూతురు తీవ్రమైన కడుపునొప్పితో విలవిల్లాడటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీనితో వెంటనే వారు ఇంటి దగ్గరికే మహిళా డాక్టర్‌ను పిలిపించగా.. అసలు నిజం బయటపడింది. పెళ్లికూతురు గర్భవతిగా ఉండటమే కాకుండా ఆమెకు పురిటి నొప్పులు వస్తున్నాయని డాక్టర్ నిర్ధారించింది.

స్టైలిష్ డిజైన్, హైబ్రిడ్ ఇంజిన్, ADAS ఫీచర్లతో 2026 Renault Duster వచ్చేసింది.. ఫీచర్స్ ఇవే..!

ఈ విషయం తెలుసుకున్న వరుడు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే పరిస్థితి అత్యవసరంగా మారడంతో డాక్టర్ ఇంట్లోనే డెలివరీ చేశారు. రాత్రి మొదలైన నొప్పులు తెల్లవారేసరికి ఇంట్లో చిన్నారి అరుపులతో ముగిశాయి. పెళ్లికూతురు ఓ ఆరోగ్యవంతమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

US winter storm: అమెరికాను కుదిపేస్తున్న మంచు తుఫాన్.. 29 మంది మృతి, అంధకారంలో లక్షలాది ఇళ్లు!

అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయమేమిటంటే.. గ్రామానికి చెందిన యువకుడు, యువతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. క్రమంగా ఆ ప్రేమ సంబంధంగా మారింది. ఈ క్రమంలో యువతి గర్భవతిగా మారింది. అయితే ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియలేదు. చివరకు పెద్దలు పెళ్లికి అంగీకరించడంతో ఇటీవలే వీరి వివాహం జరిగింది. కానీ శోభనం రోజే అసలు నిజం బయటపడింది. అయితే అనూహ్యంగా తండ్రైన వరుడు మొదట ఆశ్చర్యానికి గురైనా, పుట్టిన బిడ్డను చూడగానే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు చుట్టు పక్క ఊర్లలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని అజీమ్‌నగర్ పోలీసులు తెలిపారు. చట్టపరమైన సమస్యలు ఏవీ లేవని, పరిస్థితిని గమనిస్తున్నామని స్పష్టం చేశారు.

Exit mobile version