NTV Telugu Site icon

Matthew Breetzke: తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా ప్లేయర్ రికార్డ్..

Matthew Breetzke

Matthew Breetzke

దక్షిణాఫ్రికా యువ బ్యాట్స్‌మన్ మాథ్యూ బ్రీట్జ్కే వన్డేల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. లాహోర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ మ్యాచ్‌లో 150 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు విండీస్‌కు చెందిన డెస్మండ్ హేన్స్ (148) పేరిట ఉండేది. కాగా.. ఈ సిరీస్‌లో ఆతిథ్య పాకిస్తాన్ కూడా ఉంది. ఈ సిరీస్‌లోని రెండవ మ్యాచ్ కొత్త గడాఫీ స్టేడియంలో జరుగుతోంది. అందులో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. తన తొలి వన్డే ఆడుతున్న మాథ్యూ, కెప్టెన్ టెంబా బావుమాతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించి 150 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు.

Read Also: Andhra Pradesh: కిరణ్ రాయల్పై ఆరోపణల కేసులో ట్విస్ట్.. లక్ష్మీరెడ్డిని అరెస్ట్!

మ్యాచ్ విషయానికొస్తే.. బావుమా తొందరగానే ఔటయ్యాడు.. ఆ తర్వాత మాథ్యూస్ వికెట్‌ కోల్పోకుండా.. జాసన్ స్మిత్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. జాసన్ 41 పరుగులు చేశాడు. వియాన్ ముల్డర్ 60 బంతుల్లో 64 పరుగులతో రాణించాడు. మాథ్యూతో కలిసి వంద పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. వీరిద్దరూ కలిసి 131 పరుగులు చేశారు. చివరికి, మాథ్యూ వికెట్ 263 స్కోరు వద్ద పడిపోయింది. అంతకు ముందే మాథ్యూ రికార్డు నెలకొల్పాడు. అతను 148 బంతుల్లో 11 ఫోర్లు, ఐదు సిక్సర్లు కొట్టాడు. 1971లో ఆవిర్భవించిన 54 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఒక బ్యాట్స్‌మన్ తన అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి.

Read Also: Laila: పృథ్వి రాజ్ కామెంట్స్ కలకలం.. షైన్ స్క్రీన్స్ కీలక ప్రకటన

అంతేకాకుండా.. వన్డే అరంగేట్రంలోనే సెంచరీ చేసిన నాల్గవ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌గా మాథ్యూ బ్రీట్జ్కే నిలిచాడు. మాథ్యూ కంటే ముందు.. కాలిన్ ఇంగ్రామ్ 2010లో జింబాబ్వేపై వన్డే అరంగేట్రంలో, 2016లో ఐర్లాండ్‌పై బావుమా, 2018లో శ్రీలంకపై రీజా హెడ్రిక్స్ సెంచరీ సాధించారు. మాథ్యూ దక్షిణాఫ్రికా తరఫున టెస్ట్, టీ20ల్లో కూడా అరంగేట్రం చేశాడు.