NTV Telugu Site icon

Telangana Congress : పీసీసీ కమిటీ ప్రకటన..18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ.. పేర్లు ఇవే..!

Congress

Congress

తెలంగాణ పీసీసీ కమిటీని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చైర్మన్ గా 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించింది. తెలంగాణకు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, అజహరుద్దీన్, మహేశ్ గౌడ్ లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది కాంగ్రెస్‌. అంతేకాకుండా.. మాణికం ఠాగూర్ చైర్మన్ గా 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని కాంగ్రెస్‌ నియమించింది. ఈ కమిటీలో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్, శ్రీధర్ బాబు, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, రేణుకాచౌదరి, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి, బలరాం నాయక్, జానా రెడ్డి, వంశీచంద్ రెడ్డి, టి. జీవన్ రెడ్డి, సంపత్ కుమార్‌లతో పాటు షబ్బీర్ అలీ సభ్యులుగా ఉన్నారు. అయితే.. 24 మంది నూతన వైస్ ప్రెసిడెంట్లను, 59 మంది ప్రధాన కార్యదర్శులను, 26 జిల్లాలకు నూతన డీసీసీ ప్రెసిడెంట్లను కూడా కాంగ్రెస్ అధిష్టానం నియమించినట్లు వెల్లడించింది. కొత్త కమిటీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు లేకపోవడం తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది.

Also Read : Vaishali Kidnap Case : హెల్ప్‌ అని అరుస్తుంటే గోళ్లతో గిచ్చారు.. కొరికారు : వైశాలి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చైర్మన్‌గా తెలంగాణ కాంగ్రెస ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో.. మల్లు భట్టి విక్రమార్క, వి.హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కె. జానా రెడ్డి, టి. జీవన్ రెడ్డి 8. శ్రీమతి డా.జె. గీతారెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, దామోదర్ సి రాజ నరసింహ, రేణుకా చౌదరి, పి. బలరాం నాయక్, మధు యాష్కీ గౌడ్, డి. శ్రీధర్ బాబు, డా. జి. చిన్నా రెడ్డి, చల్లా వంశీ చంద్ రెడ్డి, S. A. సంపత్ కుమార్, పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఆర్. దామోదర్ రెడ్డి, సంభాని చంద్రశేఖర్, డా. నాగం జనార్ధన్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, సి. రామచంద్రారెడ్డి, కొండా సురేఖ, జి. వినోద్, మహమ్మద్ అజారుద్దీన్, ఎం. అంజన్ కుమార్ యాదవ్, టి. జగ్గా రెడ్డి, బి. మహేష్ కుమార్ గౌడ్, డి. సీతక్క, పొడెం వీరయ్య, ఆల్లెటి మహేశ్వర్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ్ కుమార్, శ్రీ కోదండ రెడ్డి, ఎరవర్తి అనిల్ కుమార్, వేం నరేందర్ రెడ్డి, శ్రీ మల్లు రవి, సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని లు ఉన్నారు.