Drug Seize : ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లో రూ.25కోట్లు విలువ చేసే డ్రగ్స్ సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drug Seize : దేశవ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాను రూపుమాపేందుకు కేంద్రం దృష్టి సారించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లోని టాస్క్ ఫోర్స్, పోలీసు సిబ్బందికి విస్తృత తనిఖీలు నిర్వహించి డ్రగ్స్ పెడ్లర్ల ఆటకట్టించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే సోమవారం ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఉగాండాకు చెందిన ఓ ప్రయాణికురాలి నుంచి 280గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచి తరలించేందుకు ప్రయత్నించింది. కిలాడీ లేడిపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.NDPS యాక్ట్ కేసు నమోదు చేశారు. పట్టుబడిన కొకైన్ విలువ బహిరంగ మార్కెట్లో రూ.3.85కోట్ల విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆ లేడీ పొట్టలో దాచిన కొకైన్ ను శస్త్రచికిత్స చేసి డాక్టర్లు బయటకు తీశారు.
నైజీరియా వ్యక్తి నుంచి 1660గ్రాముల కొకైన్ సీజ్
మరో ఘటనలో దాదాపు రూ.25కోట్ల విలువైన కొకైన్ ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. 25 కోట్ల విలువ చేసే 1660 గ్రాముల కొకైన్ సీజ్ చేశారు అధికారులు. నైజీరియా జాతీయుడి వద్ద కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున కొకైన్ ను గుర్తించారు. కొకైన్ ను క్యాప్సూల్స్ లో పొట్టలో కేటుగాడు దాచుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 క్యాప్సూల్స్ మింగాడు స్మగ్లర్. ఎయిర్ పోర్ట్ లో స్మగ్లర్ ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పొట్టలో దాచిన కొకైన్ గుట్టు ను రట్టు చేసింది కస్టమ్స్ బృందం. 70 కొకైన్ క్యాప్సూల్స్ ను శస్త్రచికిత్స చేసి డాక్టర్లు బయటకు తీశారు. స్మగ్లర్ అరెస్ట్ చేసి NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
తాజావార్తలు
-
Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
-
Vaibhav Sooryavanshi-BCCI: అసలు వైభవ్ సూర్యవంశీ మా ప్రణాళికల్లోనే లేడు.. పెద్ద బాంబ్ పేల్చిన బీసీసీఐ!
-
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్‌లకు గట్టి పోటీ
-
Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
-
Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ‘పార్వేట’
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!