తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఏడవ రోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా.. ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై భక్తులుకు మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు. ఇక, అలాగే ఇవాళ రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై తిరుమల శ్రీనివాసుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏడో రోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా.. తిరుమలలో బ్రేక్, ప్రత్యేక దర్శనాలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. ఇక ఎల్లుండి ( మంగళవారం )తో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
Read Also: Bharat Express: నేడు 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను ఏకకాలంలో ప్రారంభించనున్న మోడీ
కాగా, డిసెంబర్ ఒకటి నుంచి 22వ తేదీ వరకు 300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్లను సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అటు ఇదే తేదీలకు సంబంధించి సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోట టికెట్లను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇక, ఇవాళ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ కోట టికెట్లను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విడుదల చేయనుంది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 74, 884 మంది భక్తులు దర్శించుకున్నారు. 32, 213 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా.. ఇక, శ్రీవారి హుండి ఆదాయం 2.7 కోట్ల రూపాయలు వచ్చాయి.