NTV Telugu Site icon

Telangana: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియకు బ్రేక్..

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియకి ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణని నిలిపివేయాలని ఆదేశించింది. కాగా.. ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా.. ఎన్నికల సంఘం కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను నిలిపివేసింది.