NTV Telugu Site icon

Nuziveedu: నూజివీడులో పెద్ద చెరువుకు గండి.. జలదిగ్బంధంలో 50 ఇళ్లు

Nuziveedu

Nuziveedu

Nuziveedu: ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో దుర్గ గుడి వద్ద పెద్ద చెరువుకు గండి పడింది. పెద్ద చెరువు నీటితో 50 ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పది మంది స్థానికులు ఇళ్లల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. గృహ నిర్మాణ, సమాచారం, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి , ఏలూరు జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్నడూ పడని వర్షం పడిందని మంత్రి పేర్కొన్నారు. నీరు వచ్చే కాలువలను పూర్తిగా ఆక్రమణలు చేయడం వల్ల ఇటువంటి వరద రోడ్డుకు ప్రవహిస్తుందని మంత్రి పార్థసారధి వెల్లడించారు.పోలీసులు చాకచక్యంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు. ఇబ్బందులు పడ్డారు కానీ ప్రాణ నష్టం ఏమి జరగలేదని ఆర్డీవో భవాని శంకరి చెప్పారు.

Read Also: Vijayawada: కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి.. పరిహారం ప్రకటించిన సీఎం

నూజివీడులో వరద ఉధృతికి కొట్టుకుపోయిన లారీ
మరో సంఘటనలో.. నూజివీడు పట్టణంలోని బైపాస్ రోడ్డులో కోళ్ల మేతతో వెళుతున్న లారీ వరద ఉధృతికి కాలువలోకి శనివారం కొట్టుకుపోయింది. అక్కడే ఉన్న స్థానికులు లారీ డ్రైవర్‌ను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. డ్రైవర్ పాపారావు మాట్లాడుతూ.. కోళ్ల మేతతో వస్తుండగా వరద ఉధృతికి లారీని లాక్కు వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత వెళ్ళనున్నారు.

Show comments