NTV Telugu Site icon

Viral Video: కామాంధుడి తిక్కకుదిర్చిన అమ్మాయి.. నడిరోడ్డుపై.?

Viral

Viral

Viral Video: పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న విద్యార్థినిపై ఇద్దరు యువకులు వేధించారు. ఆ సంఘటన అనంతరం మార్కెట్‌ మధ్యలో సైకిల్‌ ను ఆపి వేధించిన వ్యక్తిని చెప్పుతో కొట్టింది బాలిక. ఈ సమయంలో వేధించిన వ్యక్తి కూడా బాలికను కొట్టాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. బాధిత విద్యార్థి కుటుంబీకులు నిందితులపై ఖాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసు ఖాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన మార్కెట్‌ కు చెందినది. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగినట్లు సమాచారం. ఈ ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో ఆకట్టుకోలేకపోయిన తెలుగమ్మాయి..

గతంలో కూడా యూపీలోని ముజఫర్‌ నగర్‌ లో వేధింపుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ముగ్గురు యువకులు ముఖానికి గుడ్డ కప్పుకుని విద్యార్థినులను వెంబడించి వారి కోచింగ్ సెంటర్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో యువకుడు కూడా అమ్మాయిని బెదిరించాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డైంది. ఈ కేసులో పోలీసులు కఠిన చర్యలు తీసుకుని దుండగులకు గుణపాఠం చెప్పారు. ఈ కేసు ముజఫర్‌ నగర్‌ లోని న్యూ మండిలోని గాంధీ కాలనీలో జరిగింది. నిందితులు నగరానికి చెందిన శోభిత్, ఉజ్వల్‌ గా గుర్తించారు.

Show comments