NTV Telugu Site icon

Ahobilam: ఘనంగా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు…!

Aho

Aho

అహోబిలం.. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఉన్న అద్భుతమైన ప్రదేశం. దేశంలోని 108 వైష్ణవ దివ్య దేవాలయలలో ఇది ఒకటి. దిగువ అహోబిలం, ఎగువ అహోబిలంలో ఉన్న రెండు అందమైన ఆలయాలకు ఈ ప్రాంతం ఎంతగానో ప్రసిద్ధి. ఇక్కడి స్థానిక పురాణం ప్రకారం.. విష్ణువు అవతారమైన నరసింహ స్వామి ప్రహ్లాదుడిని ఆశీర్వదించి హిరణ్యాక్షిపును సంహరించిన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే అహోబిలం నరసింహ ఆలయం మొత్తం 9 దేవాలయాలలో ప్రధాన ఆలయం అన్నిటికంటే పురాతనమైనది. కొండా కింది ప్రాంతంలో దిగువ అహోబిలం ఉండగా.. అక్కడి నుండి మరో 8 కి.మీ. దూరంలో ఎగువ అహోబిలంపై అహోబిలం నరసింహ స్వామి ఆలయం ఉంది. ఈ స్థలం కేవలం ఆధ్యాత్మిక మాత్రమే కాకుండా.. ప్రశాంతవైన వాతావరణం భక్తులు ఆస్వాదించవచ్చు.

Also Read: PSL 2024: మ్యాచ్‌ మధ్యలో ఆ పని చేసిన పాకిస్తాన్ క్రికెట‌ర్.. వీడియో వైరల్‌!

ఇకపోతే ప్రస్తుతం అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి వివిధ వాహనాల పై స్వామి వారు దర్శనమిచ్చారు. ఈ భాగంగా జ్వాలా నరసింహస్వామి ఏగువ అహోబిలంలో యోగ నరసింహస్వామిగా దర్శనమివ్వగా.. శ్రీదేవి, భూదేవి సమేతంగా అహోబిలం గుడి తిరువీధిలోని గరుడ విమానంపై ప్రదక్షిణలు చేశారు. అంతేకాకుండా స్వామివార్లకు పంచామృతాభిషేకం కూడా నిర్వహించారు.

Also Read: Honor Killing: భార్గవి హత్యకేసులో ట్విస్ట్.. తల్లి కాదు ప్రియుడే..!

ఇక దిగువ అహోబిలంలో స్వామి వారు ప్రహ్లాద వరద స్వామి హంస వాహనంపై దర్శనమివ్వగా, అక్కడి మఠాధిపతులు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇక్కడ కూడా భూదేవి అమ్మవారు, శ్రీదేవి అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రంలో భాగంగా అహోబిలం మఠం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్, ఆలయ ప్రధాన అర్చకుడు కృతాంబి వేణుగోపాలన్, పలువురు ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు.