NTV Telugu Site icon

Alert : పిల్లల్లో నిద్రలేమితో మెదడు సమస్యలు

Child Sleeping

Child Sleeping

పిల్లులు టీవీలు, కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లకు అతుక్కుపోతూ.. తగినంత నిద్ర పోవడం లేదా అయితే.. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా 7ఏళ్ల లోపు పిల్లలు తగినంత నిద్ర పోతే పెద్దయ్యాక ఏకాగ్రత లోపించటం, భావోద్వేగాలను నియంత్రించుకోలేక పోవడం, సమాచారాన్ని విడమరుచుకోలేకపోవడం వంటి సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలు బడిలోనూ, ఇంట్లోనూ పిల్లల చురుకుదనాన్ని నైపుణ్యాన్ని దెబ్బతీస్తాయి. తోటి పిల్లలతో సంబంధాలు చెడగొట్టే ప్రమాదమూ లేకపోలేదు.

Also Read : Health Tips : యవ్వనంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు!

ఇక తగినంత నిద్ర లేకపోవడం వల్ల పిల్లల మెదడు ఎదుగుదలలో సమస్యలు వస్తాయి. సాధారణంగా మూడు నుంచి నాలుగు నెలల పిల్లలకు రోజుకు 11గంటల నిద్ర అవసరం. వయసు పెరుగుతున్న కొద్దీ అవసరం తగ్గుతూ వస్తుంది. కానీ ప్రస్తుతం ఎంతో మంది పిల్లలు తగినంత నిద్ర పోవడం లేదు. దీని వల్ల పరిసరాల ప్రభావాలకు అనుభవాలకు తగినట్టుగా మెదడు స్పందించే సామర్ధ్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోతున్నప్పుడు మనం మెదడు అనవసరమైన విషయాలను తొలగించుకొని, అవసరమైన వాటిని జ్ఞాపకాలుగా స్థిరపరచుకుంటుంది. కాబట్టి పిల్లలు రాత్రిపూట పడుకునే లుచూడటం చాలా అవసరం. దీంతో వారి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పటి నుంచి అయినా మీ పిల్లలకు తగినంత నిద్ర ఉండేలా చూసుకొండి.

Also Read : Bandi Sai Bhagirath: ముదురుతున్న బండి సంజయ్ కొడుకు వివాదం..మరో వీడియో వైరల్!

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.