NTV Telugu Site icon

Assam: బ్రహ్మపుత్ర నది కింద సొరంగం నిర్మిస్తున్న భారత్.. చైనాకు చుక్కలే

Brahmaputra

Brahmaputra

Assam: చారిత్రాత్మక బ్రహ్మపుత్ర నది కింద భారత సైన్యం సొరంగం నిర్మిస్తుందని గతంలోనే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. ప్రతిపాదిత సొరంగం బ్రహ్మపుత్ర నది కింద మిసా నుంచి ప్రారంభమై తేజ్‌పూర్ వరకు కొనసాగుతుంది. చైనా కుయుక్తులను ఎదుర్కోవడానికి, భారతదేశం LAC ప్రాంతం అభివృద్ధిలో భారత్ నిమగ్నమై ఉంది. LACకి దళాలను వేగంగా తరలించడానికి బ్రహ్మపుత్ర కింద ఈ వ్యూహాత్మక సొరంగం నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మార్గం సుగమం చేసింది. గోహ్‌పూర్, నుమాలిఘర్ మధ్య ప్రతిపాదిత 35 కి.మీ పొడవైన కారిడార్ కోసం డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్)ని సిద్ధం చేయడానికి జూలై 4 న సాంకేతిక బిడ్‌లను తెరవనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.

వివిధ సొరంగాల ద్వారా రోడ్డు, రైలు ట్రాక్‌లు వేస్తామని సీఎం శర్మ చెప్పారు. ఈ సొరంగం ప్రాజెక్టుకు రూ.6,000 కోట్లు వెచ్చించనున్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఆమోదం తెలిపారు. నుమాలిగఢ్ నుండి గోహ్పూర్ వరకు దూరం దాదాపు 220 కి.మీలు. దీనికి 6 గంటల సమయం పడుతుంది. సొరంగం నిర్మాణంతో ఈ దూరం 33 కి.మీ మేర తగ్గుతుంది. దీంతో పాటు అరగంట సమయం కూడా ఆదా అవుతుంది.

Read Also:SPY : స్పై సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రానున్న మెగాస్టార్..?

సొరంగం నిర్మాణంతో NH37లో ట్రాఫిక్ తగ్గుతుంది.. ప్రజలు సుఖంగా ఉంటారు. ప్రస్తుతం బ్రహ్మపుత్ర ఉత్తరం నుండి దక్షిణానికి ట్రాఫిక్ ప్రతిపాదిత సొరంగం నుండి 100 కి.మీ దూరంలో ఉన్న కోలియా భోమోరా వంతెన ద్వారా తరలించబడుతుంది. సొరంగం బ్రహ్మపుత్ర నది యొక్క నేల స్థాయి నుండి దాదాపు 32 మీటర్ల దిగువన ఉంటుంది. నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లూయిస్ బెర్గర్ అనే నిపుణుల సలహాదారు ద్వారా ఈ సొరంగం కోసం అధ్యయనాలు చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లు ఏడాది పొడవునా అనుసంధానంగా ఉండగలుగుతాయి. సొరంగం సహాయంతో, సైనిక సరఫరా, ఆయుధాల సరఫరా కూడా జ‌రుగుతుంది. ఈ సొరంగంలో వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలవు. ఇంగ్లిష్ ఛానల్ తరహాలో బ్రహ్మపుత్ర నది కింద సొరంగాలు నిర్మించాలని ప్రభుత్వం యోచించాల‌ని సైన్యం కోరినట్లు రక్షణ వర్గాల సమాచారం. శత్రువులు వంతెనలను సులభంగా లక్ష్యంగా చేసుకోవచ్చని సైన్యం భావిస్తుంది.

ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, కాజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌కు దక్షిణంగా ఉన్న NH37లో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ నుండి ఉపశమనం లభిస్తుంది. చైనా సరిహద్దులో ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌కు సొరంగం ద్వారా దళాలను తీసుకెళ్లవచ్చు. వస్తువులను వేగంగా బదిలీ చేయవచ్చు. దీని వల్ల దేశ భద్రత పెరుగుతుంది. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతంలో అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

Read Also:AP CM Jagan Tour: ఈ నెల 28న కురుపాం నియోజకవర్గంలో సీఎం జగన్‌ పర్యటన

Show comments