NTV Telugu Site icon

Bharateeyudu-2 Prerelease Event: కమల్‌ ముందే ఆయన గొంతు మిమిక్రీ చేసిన బ్రహ్మానందం

Brahmanandam

Brahmanandam

Bharateeyudu-2 Prerelease Event: హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెషన్‌ సెంటర్‌లో ‘భారతీయుడు-2’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతోంది. ఈ ఈవెంట్‌కు సినిమాలో నటించిన నటులంతా విచ్చేశారు. ఈ వేడుకకు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా విచ్చేశారు. ఆయన రాగానే యాంకర్ సుమ స్వాగతం పలికారు. కొందరిని చూస్తేనే మన ముఖాలు నవ్వులు వెల్లివిరస్తాయంటూ బ్రహ్మానందాన్ని ఆహ్వానించారు. ఈ తరుణంలోనే సుమకు బ్రహ్మానందం దండం కూడా పెట్టారు. రాగానే వెళ్లి మామూలుగా కూర్చుని దర్శకుడు శంకర్‌తో బ్రహ్మానందం మాట్లాడారు. ఈ క్రమంలోనే బ్రహ్మానందం గారు.. బ్రహ్మానందం గారు.. అని యాంకర్ సుమ స్టేజీ మీద నుంచి మైక్‌లో పిలిచారు. ఆయన పలకకపోవడంతో గట్టిగా పిలవగా.. బ్రహ్మానందం లేచి యాంకర్ సుమకు దండం పెట్టి కూర్చున్నారు.

Read Also: Bharateeyudu 2: గ్రాండ్‌గా ‘భారతీయుడు-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. విచ్చేసిన సేనాపతి, తారాగణం

అనంతరం స్టేజీ మీద బ్రహ్మానందం మాట్లాడారు. లోకనాయకుడు కమల్‌హాసన్ నటన గురించి బ్రహ్మానందం ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కమల్‌ హాసన్ ముందే ఆయనను ఇమిటేట్ చేశారు. కమల్‌ హాసన్‌ గొంతును బ్రహ్మానందం మిమిక్రీ చేసి అభిమానులు అలరించారు. బ్రహ్మానందం కమల్‌ను మిమిక్రీ చేస్తూ..”నమస్కారం.. నేను భారతీయుడు-2 చిత్రంలో యాక్ట్ చేశాను. భారతీయుడు చిత్రాన్ని మీరందరూ హిట్ చేశారు.. మీ అందరికి తెలుసు. ఈ సినిమా కోసం అంత కంటే ఎక్కువ కష్టపడ్డాను. మన సౌత్‌లో ఉన్నవారంతా నన్ను ఆశీర్వదించారు, అభినందించారు. ఐ యామ్ సో హ్యాపీ.. నాకు మాటలు ఎక్కువగా రావడం లేదు ఎందుకంటే సంతోషంగా ఉంది. మనసంతా సంతోషంగా ఉండడంతో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. కానీ ఈ సినిమాను సక్సెస్ చేస్తే ఐ విల్ బీ హ్యాపీ. ఆల్వేస్ యువర్ కమల్‌హాసన్.. థాంక్యూ” అంటూ బ్రహ్మానందం కమల్ వాయిస్‌ను ఇమిటేట్ చేశారు. బ్రహ్మీ కమల్ హాసన్ వాయిస్‌ దించేశారు. దీనికి అభిమానులంతా చప్పట్లు కొట్టి బ్రహ్మానందాన్ని అభినందించారు.

 

Show comments